Pune: వివాహేతర సంబంధం.. తండ్రిని చంపిన తనయులు... శవాన్ని కాల్చి ఏమీ తెలియనట్లు..

Sons Killed Pune Businessman Burnt Body Extramarital Affair - Sakshi

ముంబై: మహారాష్ట్ర పుణెలోని ఖేడ్ తాలూకాలో డిసెంబర్ 15న అదృష్యమైన వ్యాపారవేత్త దనంజయ నవ్‌నాథ్ బాన్సోడ్‌(47) దారుణ హత్యకు గరుయ్యాడు. సొంత కుమారులే ఆయను హతమార్చారు. అనంతరం శవాన్ని తీసుకెళ్లి తమ ఫ్యాక్టరీలోని బట్టీలో కాల్చారు. ఇద్దరు నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.

అయితే దనంజయకు నాగ్‌పూర్‌కు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఈ విషయం ఇంట్లో తెలిసి ఆయన భార్య, కుమారులు తరచూ గొడవ పడేవారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 15న సుజిత్, అభిజిత్‌లు తమ తండ్రిని హతమార్చారని వెల్లడించారు.

ఇద్దరు కుమారులు డిసెంబర్ 15న తండ్రిని హత్య చేసి డిసెంబర్ 16న శవాన్ని ఫ్యాక్టరీకి తీసుకెళ్లి కాల్చారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు డిసెంబర్ 19న తమ తండ్రి కన్పించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోని దిగిన వారు విచారణ చేపట్టగా అసలు విషయం తెలిసింది.
చదవండి: దారుణం.. ప్రియుడితో కలిసి కూతుర్ని కడతేర్చిన తల్లి

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top