కసాయి కొడుకు..తండ్రి హత్యకు రూ. కోటి సుపారీ

Son Who Paid Crores Of Rupees For Killed His Father  - Sakshi

సాక్షి, కృష్ణరాజపురం: మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయనడానికి ఇదో ఉదాహరణ. ఓ కొడుకు కిరాయి హంతకులతో కలిసి తండ్రి హత్యకు ఏకంగా రూ.కోటి సుపారీ ఇచ్చాడు. ఈ ఘటనలో కుమారుడితో పాటు కిరాయి హంతకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈనెల 13న నారాయణస్వామి (70) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. కేసు విచారణ చేసిన పోలీసులకు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి.

నారాయణస్వామి కుమారుడు మణికంఠ తండ్రిని హత్య చేయాలని కిరాయి హంతకులకు రూ. కోటి ఒప్పందం చేసుకున్నాడు. నారాయణ స్వామిని కిరాయి మనుషులు మారతహళ్లి పీఎస్‌ పరిధిలోని ఓ అపార్టుమెంట్‌ పార్కింగ్‌ స్థలంలో దారుణంగా నరికి హత్య చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మణికంఠతో పాటు నలుగురిని అరెస్ట్‌ చేశారు. ఆస్తి గొడవలే హత్యకు కారణమని తెలిసింది. 

(చదవండి: కిడ్నీ అమ్ముతా.. కొంటారా?)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top