రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మృతి  | Software Engineer Killed in Road Accident At Hyderabad | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మృతి 

Dec 5 2021 7:01 AM | Updated on Dec 5 2021 8:03 AM

Software Engineer Killed in Road Accident At Hyderabad - Sakshi

సాక్షి, గచ్చిబౌలి: ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొని ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మృతి చెందిన సంఘటన రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ సైదులు తెలిపిన ప్రకారం.. కడప పట్టణం ఎంఐజీ హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన మనోజ్‌ కుమార్‌రెడ్డి(30) రెండేళ్లుగా మణికొండలోని పంచవటి కాలనీలో నివాసం ఉంటున్నారు. భార్య కావ్యతో కలిసి శుక్రవారం రాత్రి బైక్‌పై మాదాపూర్‌లోని పీవీఆర్‌ ఐకాన్‌లో సినిమాకు వెళ్లారు.

చదవండి: (భార్యను భరించలేను.. విడాకులు కావాల్సిందే: సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌)

తిరిగి పంచవటి కాలనీకి వెళుతుండగా మల్కచెరువు దాటిన తరువాత గాయత్రి స్కూల్‌ వద్ద ఆగి ఉన్న బొలేరా వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో మనోజ్‌కు ఛాతీ, తల భాగంలో బలమైన గాయాలు కాగా కావ్య సురక్షితంగా బయటపడింది. వెంటనే అటుగా వెళుతున్న ప్రయాణికులు సమీపంలోని సన్‌షైన్‌ ఆస్పత్రిలో చేర్పించారు.

చికిత్స పొందుతూ మనోజ్‌ కుమార్‌రెడ్డి తెల్లవారుజామున 3.09 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారని పోలీసులు తెలిపారు. భార్యభర్తల్దిదరు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు.కాగా కావ్యతో సంవత్సరం క్రితం వివాహం జరిగింది. ఉస్మానియా ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: (భర్త కుట్టిన బ్లౌజ్‌ నచ్చలేదని భార్య ఆత్మహత్య)  

Advertisement
 
Advertisement
Advertisement