‘నాతో మంచిగా ఉండు.. నీ అవసరాలు తీరుస్తా’ | SI misbehavior towards a woman | Sakshi
Sakshi News home page

‘నాతో మంచిగా ఉండు.. నీ అవసరాలు తీరుస్తా’

Jun 26 2024 3:59 AM | Updated on Jun 26 2024 3:59 AM

SI misbehavior towards a woman

మహిళ పట్ల ఓ ఎస్సై అనుచిత ప్రవర్తన... ఎస్పీకి ఫిర్యాదు  

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘నాతో మంచిగా ఉండు.. నీ అవసరాలు తీరుస్తా...’అని ఎస్సై అసభ్యకరంగా మాట్లాడాడంటూ ఓ మహిళ ఎస్సై నల్లగొండ సబ్‌డివిజన్‌ పరిధిలోని ఓ ఎస్సైపై ఎస్పీకి ఫిర్యాదు చేసింది. సోమవారం జరిగిన ప్రజావాణిలో ఎస్పీ శరత్‌చంద్రపవార్‌ను కలిసింది. ‘నా భర్త విషయంలో నేను ఫిర్యాదు చేసినా చర్యలు చేపట్టకుండా కాలయాపన చేశారు. మళ్లీ ఫిర్యాదు చేయాలని ఏప్రిల్‌ 16న స్టేషన్‌కు పిలిపించారు. 

ఎస్సై క్యాబిన్‌లో నన్ను రెండు గంటలపాటు ఉంచి అసభ్యకరంగా వ్యవహరించారు. నువ్వు ఒక్కదానివే ఎలా ఉంటున్నావు.. భర్తకు దూ రంగా ఉంటున్నావు కదా. నీకు పిల్లలు ఎప్పుడు, ఎలా పుట్టారు.. నీకు ఇప్పుడు భర్తతో ఉండాలనే కోరిక కలగడం లేదా? నాతో మంచిగా ఉండు. నీ ఫోన్‌నంబరు నాకు ఇవ్వు. నా పర్సనల్‌ నంబరు నువ్వు తీసుకో. నేను నీకు అన్నివిధాలా సహకరిస్తాను. 

నీ ప్రతి అక్కర తీరుస్తాను.. నీకు వంట వచ్చా.. వస్తే నాకు చేపలు వండుకు రా.. మరొక రోజు మేక మాంసం వండుకురా అని వేధించడమే కాకుండా నాతో బలవంతంగా గ్రీన్‌ టీ పెట్టించుకొని తాగారు. స్టేషన్‌కు ఇలా అప్పుడప్పుడు వచ్చి నేను నడుచుకొమ్మన్నట్లు నడుచుకో. నీకు అన్నివిధాలా మంచిది. ఈ సంభాషణ మన మధ్యనే ఉండాలి. ఎవరికీ చెప్పవద్దు.

ఒకవేళ చెబితే మీ కుటుంబ విషయాల్లో తలదూర్చి అక్రమ కేసులు బనాయిస్తా. అంటూనే నీకంటే మీ అమ్మ ఇంకా బాగుంది అని అన్నాడు. నేను భయపడి ఈ విషయాలు రెండు వారాల పాటు ఎవరితో పంచుకోలేదు. మీరే తగిన చర్యలు చేపట్టండి..’. అని ఎస్పీకి ఇచి్చన ఫిర్యాదులో పేర్కొన్కారు. దీనిపై ఎస్పీ విచారణకు ఆదేశించినట్టు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement