అఖిల ప్రియకు కోర్టులో చుక్కెదురు

Secundrabad Court Rejected Bhuma Akila Priya Petition For Treatment - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హాకీ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు ,అతని ఇద్దరు సోదరుల కిడ్నాప్‌ కేసులో ఏ-1గా ఉన్న భూమా అఖిలప్రియకు గురువారం సికింద్రాబాద్‌ కోర్టులో చుక్కెదురైంది. మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. కాగా ప్రవీణ్‌రావు కిడ్నాప్ కేసులో‌ అఖిలప్రియ ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో 14 రోజుల రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. (చదవండి: అఖిలప్రియ రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన విషయాలు)

ఆమె పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు.. జైలులోనే అఖిలప్రియకు అవసరమైన వైద్య సదుపాయాలు ఉన్నాయని.. వైద్యులు కూడా అందుబాటులో ఉన్నారని తెలిపింది. ఒకవేళ అఖిలప్రియ ఆరోగ్యం బాగాలేదని.. మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించాలని జైలు అధికారులు సూచిస్తే ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది. కాగా అఖిలప్రియ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై శుక్రవారం సికింద్రాబాద్‌ కోర్టులో విచారణకు రానుంది. అఖిలప్రియ బెయిల్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలంటూ కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు రేపు బెయిల్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయనున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top