పిన్నితో వివాహేతర సంబంధం.. బాబాయ్‌కి తెలిసి.. | Pocso Case Against Two Persons for Vicious Attack on Boy at Bikkavolu | Sakshi
Sakshi News home page

పిన్నితో వివాహేతర సంబంధం.. బాబాయ్‌కి తెలిసి..

Feb 13 2022 4:03 PM | Updated on Feb 13 2022 4:22 PM

Pocso Case Against Two Persons for Vicious Attack on Boy at Bikkavolu - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

వరుసకు పిన్ని అయిన మహిళకు, బాలుడికి మధ్య వివాహేతర సంబంధం ఉన్న విషయం తెలియడంతో ఆమె భర్త అప్పన్న, సతీష్‌ కలిసి బాలుడిపై పైశాచిక దాడికి పాల్పడ్డారు. ఎవరికైనా చెప్తే చంపేస్తామంటూ బెదిరించారు.

సాక్షి, తూర్పుగోదావరి(బిక్కవోలు): ఓ బాలుడిపై పైశాచిక దాడికి పాల్పడిన ఇద్దరిపై పోక్సో కేసు నమోదు చేసినట్టు ఎస్సై బుజ్జిబాబు శనివారం తెలిపారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. కొమరిపాలేనికి చెందిన 17 ఏళ్ల బాలుడిపై రెండు రోజుల క్రితం అతడి చిన్నాన్నలు మందపల్లి అప్పన్న, మందపల్లి సతీష్‌ దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. బాలుడి తొడలు, మర్మాంగంపై వాతలు పెట్టారు. దీంతో బాలుడికి తీవ్ర గాయలయ్యాయి. బాలుడి చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడిపోయారు. దీంతో అతడు కోరుకొండలోని తన పెద్దనాన్న ఇంటి వద్ద ఉండేవాడు. 

ఇటీవల తండ్రి చనిపోవడంతో బాలుడు స్వగ్రామం కొమరిపాలెం వచ్చాడు. వరుసకు పిన్ని అయిన మహిళకు, బాలుడికి మధ్య వివాహేతర సంబంధం ఉన్న విషయం తెలియడంతో ఆమె భర్త అప్పన్న, సతీష్‌ కలిసి బాలుడిపై పైశాచిక దాడికి పాల్పడ్డారు. ఎవరికైనా చెప్తే చంపేస్తామంటూ బెదిరించారు. ఆ బాలుడు ఈ విషయం పెద్దమ్మకు చెప్పగా, పెద్దనాన్న వెళ్లి దాడికి పాల్పడిన వ్యక్తులను నిలదీశాడు. అతడిపై కూడా వారు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాలుడు ప్రస్తుతం అనపర్తి సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్నాడు. అప్పన్న, సతీష్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

చదవండి: (ప్రేమించానని నమ్మించి.. ఆమె ఫొటోలు తీసి పెళ్లిళ్లు చెడగొడుతూ..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement