ప్రేమించానని నమ్మించి.. ఆమె ఫొటోలు తీసి పెళ్లిళ్లు చెడగొడుతూ.. | Pocso Case Against Young Man Over Cheating With Name of Love | Sakshi
Sakshi News home page

ప్రేమించానని నమ్మించి.. ఆమె ఫొటోలు తీసి పెళ్లిళ్లు చెడగొడుతూ..

Feb 13 2022 7:09 PM | Updated on Feb 13 2022 7:51 PM

Pocso Case Against Young Man Over Cheating With Name of Love - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, తూర్పుగోదావరి(పిఠాపురం): ప్రేమ పేరుతో ఓ బాలికను దారుణంగా వంచించిన యువకుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. గొల్లప్రోలు ఎస్సై రామలింగేశ్వరరావు కథనం ప్రకారం.. గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామానికి చెందిన బాలిక (17) పిఠాపురంలోని ఒక ప్రైవేటు కాలేజీలో ఎంఎల్‌టీ ఒకేషనల్‌ కోర్సు చదువుతోంది. అదే గ్రామానికి చెందిన కుక్కా రామకృష్ణ ప్రేమ పేరుతో రెండేళ్లు ఆమె వెంట పడ్డాడు.

తాను ఇంకా చదువుకోవాలని, తనకు ప్రేమ ఇష్టం లేదని చెప్పినా వినేవాడు కాదు. తనను ప్రేమించకపోతే పురుగుల మందు తాగి చచ్చిపోతానంటూ బెదిరించాడు. దీంతో తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇస్తేనే ప్రేమిస్తానని ఆ బాలిక చెప్పగా అంగీకరిస్తున్నానని నమ్మించిన రామకృష్ణ ఆమెను లొంగదీసుకున్నాడు. వివిధ ప్రాంతాలకు తీసుకువెళ్లేవాడు. ఎంత వారించినా వినకుండా తన సెల్‌ ఫోన్‌లో ఆమె ఫొటోలు తీసేవాడు.

చదవండి: (వంటగదిలో ప్రియుడితో భార్య..  భర్తకు మెలకువచ్చి ప్రశ్నించగా)

తల్లిదండ్రులు ఆ బాలికకు పెళ్లి సంబంధాలు చూస్తుంటే.. రామకృష్ణ తన వద్ద ఉన్న ఫొటోలను పెళ్లికొడుకు తరఫు వారికి పంపించి సంబంధాలు చెడగొట్టేవాడు. అలాగైతే తనను పెళ్లి చేసుకోవాలని ఆమె గట్టిగా నిలదీయడంతో తన తల్లి కుక్కా గంగా సత్యవతి, అన్న మురళి అడ్డం పడుతున్నారని చెప్పాడు. ఈ వ్యవహారంపై బాలిక తల్లిదండ్రులు స్థానిక పెద్దల వద్ద గత ఏడాది డిసెంబర్‌ 30న పంచాయతీ పెట్టారు. అక్కడ న్యాయం జరగకపోవడంతో ఆ బాలిక శనివారం పోలీసులను ఆశ్రయించింది. దీనిపై పోక్సో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రామలింగేశ్వరరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement