నూతన జంట జలసమాధి.. ఐదు నెలల క్రితమే ప్రేమ వివాహం | Newly Married Couple End Lives In Mysore | Sakshi
Sakshi News home page

నూతన జంట జలసమాధి.. ఐదు నెలల క్రితమే ప్రేమ వివాహం

Nov 6 2022 7:55 AM | Updated on Nov 6 2022 7:55 AM

Newly Married Couple End Lives In Mysore - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

మైసూరు: ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంట ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందిన విషాద ఘటన నగరంలో చోటుచేసుకుంది. వివరాలు... మైసూరు తాలూకా శాదనహళ్లి గ్రామానికి చెందిన శివకుమార్‌ (29), కవిత (25) ఐదు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. శ్రీరంగ పట్టణంలోని మేగరళ్లి గ్రామంలో నివాసం ఉంటున్నారు.

శనివారం కేఆర్‌ఎస్‌ సమీపంలో ఉన్న వరుణ కాలువ కట్ట వద్ద కూర్చొని కవిత బట్టలు ఉతుకుతుండగా కాలువలోకి జారి పడింది. అక్కడే ఉన్న శివకుమార్‌ కాలువలో దూకి ఆమెను కాపాడే యత్నంలో అతను కూడా నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు అక్కడికి చేరుకుని ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు. గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.  

Advertisement
 
Advertisement
Advertisement