ఒంటరిగా వెళ్తున్న మహిళతో మాటలు.. అంతలో వెనక నుంచి..

Mumbai Woman Molestation Return For Catering Work Alone Police Caught Two Minors - Sakshi

ముంబై: ఒంటరిగా రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళ పై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్ర లోని ముంబై చోటు చేసుకుంది. . వివరాల్లోకి వెళితే.. మహిళ తన క్యాటరింగ్ పనిని ముగించుకుని ఇంటికి తిరిగి వెళుతుండగా నిందితుల్లో ఒకరు తెలిసినవాడు కావడంతో ఆమెను అడ్డుకున్నారు. ఇంత ఆలస్యంగా ఇంటికి ఎందుకు వస్తున్నారని ఆరా తీశారు.

ఇంతలో మరో నిందితుడు ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించే ప్రయత్నం చేశాడు. వాళ్ళని అడ్డుకునేందుకు మహిళ తీవ్రంగా ప్రయత్నించినప్పటికి అంతలోనే మరొకరు చేరి, ఆమె గొంతును బిగించి, ఆమెపై వాళ్ళు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. నేరం చేసిన తర్వాత నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన తర్వాత మహిళ స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. టెక్నికల్ ఇంటెలిజెన్స్, బాధితురాలు తెలిపిన వివరాలను అనుసరించి నలుగురు నిందితుల గుర్తింపును పోలీసులు నిర్ధారించారు. పోలీసులు కేసు ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకోగా, పరారీలో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top