వివాహేతర సంబంధం మోజులో... భర్త దారుణ హత్య | Man Murdered by his Wife With Extramarital Affair in Tumakuru Karnataka | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం మోజులో... భర్త దారుణ హత్య

Apr 14 2022 7:04 AM | Updated on Apr 14 2022 7:48 AM

Man Murdered by his Wife With Extramarital Affair in Tumakuru Karnataka - Sakshi

భార్య మీనాక్షి, ప్రియుడు రాకేశ్‌

సాక్షి, తుమకూరు (కర్ణాటక): ప్రియుని మత్తులో పడి భర్తనే ఓ భార్య చంపించింది. శిరా తాలూకా కరేజవనహళ్లి గ్రామంలో రాజు (34)ను మంగళవారం రాత్రి ప్రియుడు రాకేష్‌ (19), భార్య మీనాక్షి (25) హత్య  చేశారు. ఎనిమిదేళ్ల క్రితం మీనాక్షితో రాజుకు వివాహం జరిగింది. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కరేజవనహళ్లి గ్రామానికి చెందిన రాకేశ్‌ తుమకూరులోని ప్రైవేటు కాలేజీలో చదువుకుంటున్నాడు. ఒక పెళ్లిలో మీనాక్షితో పరిచయం అయిన రాకేశ్‌ ఆ తర్వాత ఫోన్‌ నంబర్లు మార్చుకుని మాట్లాడుకోవడం ప్రారంభించారు.

టైలర్‌ అయిన మీనాక్షి దగ్గరికి దుస్తులు ఇచ్చే నెపంతో తరచూ వచ్చి అక్రమ సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. ఏడాదిగా ఇది కొనసాగుతోంది. రెండు నెలల క్రితం బెంగళూరులో కూలీ పనిచేస్తున్న రాజు తిరిగి ఇంటికి వచ్చాడు. తమ ఆనందానికి రాజు అడ్డుగా ఉన్నాడని, మట్టుబెట్టాలని ఇద్దరూ నిర్ణయించారు. సమీపంలోని తోటలో రాజును రాకేష్‌ మందు పార్టీకి పిలిచి మత్తులోఉండగా బండరాయితో కొట్టి చంపాడు. ఆపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. సమాచారం అందుకున్న కళ్లంబెళ్ల పోలీసులు ప్రేయసీ ప్రియున్ని అరెస్టు చేశారు.

 చదవండి: (వ్యభిచార ముఠా గుట్టు రట్టు.. ఐదుగురి అరెస్ట్‌.. నలుగురు పరారీ)

Advertisement
 
Advertisement
Advertisement