యువతిని వేధించి.. కానిస్టేబుల్‌పై దాడిచేసి.. | Man Molestation Young Women In West Godavari District | Sakshi
Sakshi News home page

యువతిని వేధించి.. కానిస్టేబుల్‌పై దాడిచేసి..

Oct 7 2020 11:42 AM | Updated on Oct 7 2020 12:26 PM

Man Molestation Young Women In West Godavari District - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: జంగారెడ్డి గూడెంలో రోహిత్‌ అనే యువకుడు హరిప్రియ అనే యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో యువతిని కాపాడేందుకు వెళ్లిన కానిస్టేబుల్‌పై కూడా దాడి చేశాడు. దీంతో రోహిత్‌పై జంగారెడ్డిగూడెం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే రోహిత్‌ పోలీసులు తనపై అక్రమంగా కేసు పెట్టారంటూ నిన్న రాత్రి నుంచి సెల్‌ టవర్‌ ఎక్కి నిరసన తెలుపుతున్నాడు. ఈ క్రమంలో సెల్‌టవర్‌పై తేనేటీగలు ఒక్కసారిగా చెలరేగడంతో రోహిత్‌ కేబుల్‌ వైర్లు పట్టుకుని కిందకు దూకేశాడు. తేనేటీగలకు భయపడి స్థానికులు భయంతో పరుగులు తీశారు. దీంతో గాయపడిన రోహిత్‌ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. 

Advertisement
 
Advertisement
Advertisement