భార్య కాపురానికి రావడం లేదని..

మనస్తాపంతో భర్త ఆత్మహత్య
పటాన్‌చెరు టౌన్: భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన పటాన్‌చెరు పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పటాన్‌చెరు మండల పరిధిలోని ఇంద్రేశం గ్రామానికి చెందిన షేక్ సలీం(35) ఏడాది క్రితం భార్య తస్లీమా బేగంతో గొడవ పడటంతో భార్య ఇద్దరు పిల్లలని తీసుకొని రామచంద్రాపురం బొంబాయి కాలనీకి వెళ్లిపోయింది.
భార్యను పలుమార్లు ఇంటికి రమ్మని షేక్ సలీం అడగడటంతో వస్తే కొడతావు అని భార్య రాలేదు. దీంతో భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపం చెంది షేక్ సలీం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.