కన్నతల్లి బరువైంది.. రెండు రోజులుగా ఆహారంలేక

Sons Left His Mother On Road At Vikarabad District - Sakshi

కొడంగల్‌: పేగు తెంచుకుని పుట్టిన కొడుకులు తమ కన్నతల్లిని రోడ్డుపై వదిలేశారు. రెండు రోజులుగా ఆహారం లేక, చలికి వణుకుతూ ఆ వృద్ధురాలు అపస్మారక స్థితికి చేరుకుంది. ఈ హృదయ విదారక ఘటన వికారాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. కోస్గి మండలం కడంపల్లి గ్రామానికి చెందిన 80 ఏళ్ల మహిళను ఆమె కుమారులు రెండు రోజులక్రితం కొడంగల్‌ బస్టాండ్‌లో వదిలేసి వెళ్లిపోయారు. దీంతో అందరూ ఉండి కూడా ఆమె అనాథలా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. బస్టాండ్‌లోని వ్యాపారులు, పరిసర వాసులు ఆమెకు రెండు రోజులు తిండి పెట్టారు.

ఆదివారం ఉదయం ఆరోగ్యం క్షీణించడంతో బస్టాండ్‌లోకి తరలించారు. ఆ వృద్ధురాలికి ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె దయనీయ పరిస్థితిని గమనించిన కొడంగల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ జగదీశ్వర్‌రెడ్డి స్పందించారు. సోమవారం ఉదయం ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని ఆయన తెలిపారు. 
చదవండి: చిట్టి తల్లికి.. పెద్ద కష్టం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top