ట్రాన్స్‌ఫార్మర్‌పైనే ప్రాణం పోయింది | Man Deceased On Transformer With Electric Shock In Siddipet District | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌ఫార్మర్‌పైనే ప్రాణం పోయింది

Dec 6 2020 5:35 AM | Updated on Dec 6 2020 5:35 AM

Man Deceased On Transformer With Electric Shock In Siddipet District - Sakshi

ట్రాన్స్‌ఫార్మర్‌పై నుంచి మృతదేహాన్ని తీస్తున్న గ్రామస్తులు

కోహెడరూర్‌(హుస్నాబాద్‌): ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమ్మతు చేస్తుండగా కరెంట్‌ షాక్‌కు గురై ట్రాన్స్‌ఫార్మర్‌పైనే ఓ వ్యక్తి ప్రాణాలు వదిలిన ఘటన సిద్దిపేట జిల్లా కోహెడ మండలం ఆరెపల్లిలో శనివారం చోటు చేసుకుంది. పోరెడ్డిపల్లికి చెందిన మంద తిరుపతి(35) లైన్‌మన్‌ సహాయంతో ఎల్‌సీ తీసుకొని ఆరెపల్లిలోని ఓ రైతు పొలంలో ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమ్మతులు చేస్తున్నాడు.

మధ్యలోనే విద్యుత్‌ సరఫరా కావడంతో షాక్‌కు గురై ట్రాన్స్‌ఫార్మర్‌పైనే ప్రాణాలు విడిచాడు.  కుటుంబసభ్యులు, గ్రామస్తులు మృతదేహం తో సిద్దిపేట– హన్మకొండ రహదారిపై ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రహదారి పై అటుగా వెళ్తున్న రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్‌ ఘటనాస్థలాన్ని పరిశీలించి రూ.15 లక్షలు, తిరుపతి భార్యకు ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. మంత్రి హామీతో ఆందోళన విరమించారు.  

Advertisement
 
Advertisement
Advertisement