వివాహేతర సంబంధం: యువకుడి హత్య! | Man Brutally Murdered In Odisha | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం: యువకుడి హత్య!

Feb 14 2021 2:02 PM | Updated on Feb 14 2021 4:17 PM

Man Brutally Murdered In Odisha - Sakshi

మంచంపై యువకుడి మృతదేహం,పోలీసులకు పట్టుబడిన నిందితులు

సాక్షి, భువనేశ్వర్‌( మల్కన్‌గిరి): జిల్లాలోని పొడియా సమితి, మెడిమెట్ల గ్రామంలో ఇర్మ కావసీ అనే యువకుడిని ఇదే గ్రామానికి చెందిన అడ్మ కావసీ అతడి తమ్ముడు ముక్క కావసీలు హత్య చేశారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్ట్‌ చేశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికి మృతదేహం తరలించారు. 

వివరాలిలా ఉన్నాయి.. గత కొంతకాలం నుంచి అడ్మ కావసీ భార్య, ఇర్మ కావసీల మధ్య వివాహేతర సంబంధం నడుస్తోంది. ఇది తెలుసుకుని సహించలేని అడ్మ కావసీ తన భార్య, ఇర్మ కావసీలతో తరచూ గొడవలు పడుతుండేవాడు. ఎప్పటిలాగే శుక్రవారం రాత్రి అడ్మ కావసీ తన భార్యకి మధ్య గొడవ జరగగా, కోపోద్రేకుడైన అడ్మ కావసీ దీనంతటికీ కారణం ఇర్మ కావసీనేనని భావించి, తన తమ్ముడితో అతడి ఇంటికి నేరుగా వెళ్లాడు. ఆ తర్వాత అక్కడ నిద్రపోతున్న ఇర్మ కావసీని అన్నదమ్ములిద్దరూ కత్తితో పొడిచి చంపేశారు. ఈ విషయం తెలుసుకున్న బాధిత కుటుంబం తమ కొడుకు పడుకున్న స్థలానికి చేరుకునేలోపు నిందితుల అక్కడి నుంచి పారిపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement