ఉరి వేసుకుంటున్నట్లు నాటకమాడి.. | Man Assassinated Over Drama Selfie Video | Sakshi
Sakshi News home page

ఉరి వేసుకుంటున్నట్టు నాటకమాడి..

Sep 14 2020 7:17 AM | Updated on Sep 14 2020 7:17 AM

Man Assassinated Over Drama Selfie Video - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, చెన్నై: ఉరి వేసుకుంటున్నట్టు నాటకమాడి సెల్ఫీతో రక్తికట్టించిన ఓ యువకుడు చివరకు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. తేని జిల్లా బొమ్మినాయకన్‌ పట్టికి చెందిన ద్రవ్యం(23) శివగంగైలోని ఓ బోర్‌వెల్‌ సంస్థలో పనిచేస్తున్నాడు. పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన ఇతగాడు బంధువులు, మిత్రుల్ని బెదిరించేందుకు ఓ నాటకం ఆడాడు. ఇంటి దూలానికి ఉరి వేసుకుంటున్నట్టు సెల్ఫీ తీశాడు. దానిని మిత్రులు, బంధువులకు పంపించాడు. రెండుసార్లు సెల్ఫీ తీసి పంపించిన ద్రవ్యం మూడో ప్రయత్నం బెడిసి కొట్టింది. ( లవ్‌ ఫెయిల్‌: బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య )

హఠాత్తుగా కిందున్న కుర్చీజారడంతో తాడు గొంతుకు బిగుసుకుంది. దీంతో ఊపిరాడక ప్రాణాలు విడిచాడు. ఆదివారం ఉదయం అతడి గదికి వెళ్లిన సహచరులు ఉరిపోసుకుని వేలాడుతున్న ద్రవ్యంను చూసి ఆందోళన చెందారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విచారణలో సెల్ఫీ మోజు అతగాడి ప్రాణం తీసినట్టు తేలింది.

Advertisement
 
Advertisement
Advertisement