ఈసీ వెబ్‌సైట్‌ హ్యాక్‌

UP man arrested for hacking into ECI website, creating fake IDs - Sakshi

సహరాన్‌పూర్‌/న్యూఢిల్లీ: భారత ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేసి అందులో 10 వేలకు పైగా ఫేక్‌ ఓటర్‌ ఐడీలను తయారు చేసిన విపుల్‌ సైని(24)ని ఉత్తరప్రదేశ్‌ పోలీసులు  అరెస్టు చేశారు. బ్యాచిలర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ (బీసీఏ) డిగ్రీ కలిగిన విపుల్‌ మూడు నెలల్లో 10 వేల ఫేక్‌ ఐడీలను క్రియేట్‌ చేసినట్లు తేలిందని అధికారులు వెల్లడించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్మాన్‌ మాలిక్‌ అనే వ్యక్తి ఈ పనులు చేయించినట్లు తెలిసిందన్నారు. ఒక్కో ఐడీ కార్డుకు రూ. 100–200 చొప్పున విపుల్‌ తీసుకున్నట్లు తేలింది. అతని బ్యాంకు అకౌంట్లో ఉన్న రూ. 60 లక్షలను సీజ్‌ చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top