వీడియో తీయొద్దు అన్నందుకు.... డ్యూటీలో ఉన్న పోలీస్‌ని గట్టిగా కరిచి పరార్‌..

Man Allegedly Biting Policeman Stopped Him Shooting At Police Station - Sakshi

ముంబై: మహారాష్ట్రలో ఒక వ్యక్తి డ్యూటీలో ఉన్న ఒక​ పోలీస్‌ని గట్టిగా కరిచి గాయపరిచాడు. తమను వీడియో తీస్తున్నాడని ఒక పోలీసు జోక్యం చేసుకుని అడ్డుకున్నందుకు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రలో నాగ్‌పూర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...మకర్ధోక్డా గ్రామానికి చెందిన రాకేష్‌ పురుషోత్తం గజ్భియే అనే 30 ఏళ్ల వ్యక్తి తనతో వివాదం పెట్టుకున్న వ్యక్తిపై కేసు నమోదు చేయమంటూ పోలిస్టేషన్‌కి వెళ్లాడు. ఐతే పోలీసులు కేసు నమోదు చేయలేదు.

దీంతో ఆగ్రహం చెందిన వ్యక్తి ఆ పోలిస్టేష్‌న్‌ ఆవరణలో ఉన్న పోలీసులందర్నీ ఫోన్‌లో వీడియో తీయడం ప్రారంభించాడు. దీన్ని గమనించిన ఒక పోలీసు జోక్యం చేసుకుని అడ్డుకున్నందుకు అతన్ని గట్టిగా కరిచి ద్విచక్ర వాహనం పై పారిపోయాడని పోలీసులు తెలిపారు. డ్యూటీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని తన విధులు నిర్వర్తించకుండా అడ్డుకుని గాయపరిచినందుకు సదరు వ్యక్తి గజ్భియేపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

(చదవండి: మద్యం బాటిళ్లతో గాజుల తయారీ... జీవనోపాధి ఇస్తూ...వ్యర్థాలకు చెక్‌)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top