ఒక ప్రేయసి.. 50 ముక్కలు! | Jharkhand Man Assassinate Live in partner | Sakshi
Sakshi News home page

ఒకరితో సహజీవనం.. మరొకరితో పెళ్లి! చివరకు..

Published Thu, Nov 28 2024 3:03 PM | Last Updated on Thu, Nov 28 2024 3:50 PM

Jharkhand Man Assassinate Live in partner

జార్ఖండ్‌లో  దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు తనతో సహజీవనం చేస్తున్న యువతిని అతి కిరాతంగా హతమార్చాడు. అంతటితో ఆగకుండా.. మృతురాలి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. ఖుంటి జిల్లాలోని జరియాగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వారాల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్‌లోని జిల్లాలోని జోర్దాగ్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల నరేష్ బెంగ్రా అనే యువకుడు గంగి కుమారి(24) అనే యువతితో గత రెండేళ్లుగా సహ జీవనంలో ఉన్నారు. వీరిద్దరూ తమిళనాడులో పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు.నరేష్ బెంగ్రా తన ప్రియురాలు గంగి కుమారికి తెలియకుండా ఖుంటిలో మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. 

అనంతరం ఏమి తెలియనట్లు మళ్లీ తమిళనాడు వచ్చి గంగితో కలిసి జీవించేవాడు. ఇటీవల ఈ విషయం ప్రియురాలికి తెలియడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో నవంబర్‌ 9న ఇద్దరు జార్ఖండ్‌లోని ఖుంటికి తిరిగి వచ్చారు. యువతిని తన ఇంటికి సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి గొంతు నులిమి చంపేశాడు. అనంతరం శరీరాన్ని 50 ముక్కలుగా నరికి అడవిలోనే విసిరేశాడు.

నవంబర​ 24న యువతి శరీరంలోని ఓ భాగాన్ని కుక్క తింటూ కనిపించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అది గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వగా..  అటవీ ప్రాంతం నుంచి మరి కొన్ని శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అడవిలో గంగి వస్తువులు, ఆమె ఆధార్ కార్డు, ఫోటోతో సహా, ఆమె బ్యాగ్‌ని కూడా పోలీసులు గుర్తించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు నరేశ్ బెంగ్రా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో బాధితురాలిని హత్య చేసి, ఆమె మృతదేహాన్ని నరికివేసినట్లు అతను ఒప్పుకున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement