అమానుషం: లిఫ్ట్‌ అడిగిన పాపానికి నిలువునా ప్రాణం తీశాడు

ITI Student Assasinates One Man Due To Bike Petrol At Chennai - Sakshi

చెన్నై‌: లిఫ్ట్‌ కోరిన వ్యక్తి పెట్రోలుకు డబ్బు ఇవ్వలేదన్న ఆగ్రహంతో హత్య చేసిన ఘటన తిరువణ్ణామలైలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి ఐటీఐ విద్యార్థిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. కలసపాక్కం ప్రాంతానికి చెందిన శంకర్‌(43) చెన్నై కొలత్తూరులో భవన నిర్మాణ పనులు చేస్తుండేవాడు. ఈనెల 4వ తేదీన కొలత్తూరు వలర్మతినగర్‌లో రక్తగాయాలతో పడివుండగా 108 సిబ్బంది పరీక్షించి మృతిచెందినట్లు నిర్ధారించారు.కేసు నమోదు చేసి విచారణ జరిపారు.

సంఘటనా ప్రాంతంలోని సీసీ కెమెరాను పరిశీలించగా కొలత్తూరు అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన శశికుమార్‌ బైక్‌పై వస్తుండగా శంకర్‌ లిఫ్ట్‌ కోరినట్లు తెలిసింది. దీని ఆధారంగా విచారణ జరపగా శంకర్‌ లిఫ్ట్‌ కోరినందున శశికుమార్‌ అతన్ని పెట్రోలుకు నగదు అడిగినట్లు, అతను ఇవ్వనందున హతమార్చినట్లు తెలిసింది. దీంతో శశికుమార్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.

యువకుడి హత్య:  
సేలంలోని టాస్మాక్‌ బార్‌లో జరిగిన తగాదాలో వ్యాపారి హత్యకు గురయ్యాడు. మరో ముగ్గురు గాయపడ్డారు. శనివారం రాత్రి సేలం కిచ్చిపాళయానికి చెందిన వ్యాపారి కృపాకరన్‌ (40) తన స్నేహితులతో బార్‌లో మద్యం సేవిస్తుండగా మోహన్‌ అనే వ్యక్తితో గొడవ ఏర్పడింది. దీంతో ఆగ్రహించిన మోహన్‌ కృపాకరన్‌పై బీర్‌ బాటిల్‌ పగులగొట్టి దాడిచేయగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. స్నేహితులు మరో ముగ్గురికి గాయాలయ్యాయి. పోలీసులు విచారణ జరుపుతున్నారు.
చదవండి:  కిలేడీ చేసిన పనికి విసిగిపోయిన అతడు!

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top