‘మాయా’ మసాజ్‌ సెంటర్లు.. కష్టమర్‌గా ఓ వ్యక్తిని పోలీసులు పంపడంతో.. | HYD Police Raids On Massage Centres Runs Unscrupulous Activities | Sakshi
Sakshi News home page

Hyderabad: ‘మాయా’ మసాజ్‌ సెంటర్లు.. కష్టమర్‌గా ఓ వ్యక్తిని పోలీసులు పంపడంతో..

Nov 24 2021 9:30 AM | Updated on Dec 19 2021 11:32 AM

HYD Police Raids On Massage Centres Runs Unscrupulous Activities - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సీసీ కెమెరాలు లేకపోవడం, క్రాస్‌ మసాజ్‌ లాంటివి జరుగుతుండటంతో ముగ్గురు కస్టమర్‌లను ఒక రిసెప్షనిస్ట్‌ను..

సాక్షి, కుషాయిగూడ: గుట్టు చప్పుడు కాకుండా బ్యూటీ పార్లర్ పేరుతో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఓ మసాజ్ సెంటర్‌పై మల్కాజిగిరి ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేశాడు. మల్కాజిగిరి ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని డాక్టర్‌ ఏఎస్‌ రావు నగర్‌లో గ్లోయిస్ బ్యూటీ కేర్ సెంటర్ పేరుతో  కొన్ని రోజులుగా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది

మంగళవారం రాత్రి కష్టమర్‌గా ఓ వ్యక్తిని పోలీసులు పంపగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మసాజ్‌ సెంటర్‌ ముసుగులో పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్‌ చేస్తూ అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నట్లు గుర్తించారు. నిర్వాహకుడు మహేశ్‌తో పాటు అందులో పనిచేస్తున్న అసోం, ఆంద్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతానికి చెందిన అయిదుగురు యువతులను రెస్క్యూ చేసి కుషాయిగూడ పోలీసులకు అప్పగించారు.
చదవండి: చిక్కడపల్లి సీఐ, ఎస్‌ఐపై సస్పెన్షన్‌ వేటు   

మసాజ్‌ సెంటర్లపై టాస్క్‌ఫోర్స్‌ దాడి
హిమాయత్‌నగర్‌: నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న మసాజ్‌ పార్లర్‌లపై సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ బృందం ఆకస్మిక దాడులు నిర్వహించింది. సోమవారం రాత్రి నగర వ్యాప్తంగా నిర్వహించిన దాడుల్లో భాగంగా హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌ ఎదురుగా ఉన్న ఓ స్పాలో రైడ్‌ చేశారు. ఇక్కడ సరిగా రికార్డులు మెయింటైన్‌ చేయకపోవడం, కస్టమర్ల వివరాలను సేకరించకపోవడం, సీసీ కెమెరాలు లేకపోవడం, క్రాస్‌ మసాజ్‌ లాంటివి జరుగుతుండటంతో ముగ్గురు కస్టమర్‌లను ఒక రిసెప్షనిస్ట్‌ను అరెస్ట్‌ చేసి నారాయణగూడ పోలీసులకు అప్పగించారు. 
చదవండి: ముసురు వానకు పాడైన పంట.. ఆగిన రైతు గుండె  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement