230 స్పీడ్‌లో బీఎండబ్ల్యూ.. మేమంతా చావబోతున్నాం.. కాసేపటికే.. | High Speed BMW Car Hit Truck Four Youth Dead Uttar Pradesh | Sakshi
Sakshi News home page

గంటకు 230 కిలోమీటర్ల వేగం.. 30 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డ యువకుని తల

Oct 15 2022 9:26 PM | Updated on Oct 15 2022 9:27 PM

High Speed BMW Car Hit Truck Four Youth Dead Uttar Pradesh - Sakshi

కారులో వెళ్తూ వీరంతా ఫేస్‌బుక్‌ లైవ్‌లో స్పీడ్‌మీటర్‌పై పోకస్ చేసి వీడియో తీశారు. ఆ సమయంలో ఓ యువకుడు 'మేమంతా కాసేపట్లో చావబోతున్నాం' అని అన్నాడు.

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌ సుల్తాన్‌పూర్‌ జిల్లా పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో వెళ్తున్న బీఎండబ్ల్యూ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు మొత్తం పూర్తిగా ధ్వంసమై తుక్కును తలపించింది. ఇంజిన్, ఇతర భాగాలు చెల్లాచెదురయ్యాయి.

ఈ ఘోర ప్రమాదంలో మృతి చెందిన ఓ యువకుడి తల, చేయి 20-30 దూరంలో ఎగిరిపడ్డాయి. ఘటన సమయంలో బీఎండబ్ల్యూ గంటకు 230కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. కారులో వెళ్తూ వీరంతా ఫేస్‌బుక్‌ లైవ్‌లో స్పీడ్‌మీటర్‌పై పోకస్ చేసి వీడియో తీశారు. ఆ సమయంలో ఓ యువకుడు 'మేమంతా కాసేపట్లో చావబోతున్నాం' అని అన్నాడు. కాసేపటికే కారు ప్రమాదానికి గురై నలుగురూ చనిపోయారు.

అయితే మృతుల్లో ముగ్గురిని ఆనంద్ ప్రకాశ్(37), అఖిలేశ్ సింగ్(35), దీపక్‌ కుమార్‌(37)గా గుర్తించారు పోలీసులు. కానీ మరో యువకుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని చెప్పారు.
చదవండి: విషాదం.. ప్రాణాలు కాపాడే అంబులెన్సే మృత్యుపాశమైంది..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement