హర్భజన్‌ను రూ.4 కోట్లతో ముంచిన చెన్నై వ్యాపారి

Harbhajan Singh Files Complaints Against Chennai Business Man - Sakshi

చెన్నై : టీమిండియా వెటరన్ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ గురువారం చెన్నై పోలీసులను ఆశ్రయించాడు. చెన్నైకి చెందిన ఒక వ్యాపారి రూ.4 కోట్లు అప్పుగా తీసుకొని ఎగ్గొట్టడంతో భజ్జీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు.. 2015లో హర్బజన్‌ కామన్ ఫ్రెండ్ ద్వారా చెన్నైకి చెందిన జి.మహేష్ అనే వ్యాపారవేత్త పరిచయం అయ్యాడు. తన స్నేహితున్ని నమ్మి హర్భజన్‌ మహేష్‌కు రూ.4 కోట్లు అప్పుగా ఇచ్చాడు. అయితే డబ్బులు తిరిగి ఇవ్వాలని భజ్జీ ఎన్నోసార్లు అడిగాడు. గత ఆగస్టులో భజ్జీ పేరు మీద మహేష్‌ రూ. 25 లక్షల చెక్కును పంపినా.. అది బౌన్స్‌ అయింది. (చదవండి : 2 లేక 20 కోట్లా అన్న‌ది ముఖ్యం కాదు..)

అప్పటినుంచి డబ్బులు ఇవ్వకుండా మహేష్ తప్పించుకు తిరుగుతూ  మోసం చేశాడు. దీంతో ఇక లాభం లేదని గురువారం హర్భజన్‌ తమిళనాడు పోలీసులను ఆశ్రయించి మహేష్‌పై ఫిర్యాదు చేశాడు.అయితే ఈ వ్యవహారంలో సదరు వ్యాపారవేత్త ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. కాగా హర్భజన్ సింగ్ వ్యక్తిగత కారణాల వల్ల ఈ ఏడాది ఐపీఎల్ 2020‌కు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. చెన్నైకి ప్రాతినిధ్యం వహిస్తున్న భజ్జీ ఐపీఎల్‌కు దూరం కావడంతో రూ.2 కోట్లు కోల్పోనున్నాడు.(చదవండి : మేమేంటో మా ఇద్దరికి మాత్రమే తెలుసు)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top