breaking news
chennai business man
-
హర్భజన్‌ను రూ.4 కోట్లతో ముంచాడు
చెన్నై : టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ గురువారం చెన్నై పోలీసులను ఆశ్రయించాడు. చెన్నైకి చెందిన ఒక వ్యాపారి రూ.4 కోట్లు అప్పుగా తీసుకొని ఎగ్గొట్టడంతో భజ్జీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు.. 2015లో హర్బజన్ కామన్ ఫ్రెండ్ ద్వారా చెన్నైకి చెందిన జి.మహేష్ అనే వ్యాపారవేత్త పరిచయం అయ్యాడు. తన స్నేహితున్ని నమ్మి హర్భజన్ మహేష్‌కు రూ.4 కోట్లు అప్పుగా ఇచ్చాడు. అయితే డబ్బులు తిరిగి ఇవ్వాలని భజ్జీ ఎన్నోసార్లు అడిగాడు. గత ఆగస్టులో భజ్జీ పేరు మీద మహేష్ రూ. 25 లక్షల చెక్కును పంపినా.. అది బౌన్స్ అయింది. (చదవండి : 2 లేక 20 కోట్లా అన్నది ముఖ్యం కాదు..) అప్పటినుంచి డబ్బులు ఇవ్వకుండా మహేష్ తప్పించుకు తిరుగుతూ మోసం చేశాడు. దీంతో ఇక లాభం లేదని గురువారం హర్భజన్ తమిళనాడు పోలీసులను ఆశ్రయించి మహేష్‌పై ఫిర్యాదు చేశాడు.అయితే ఈ వ్యవహారంలో సదరు వ్యాపారవేత్త ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. కాగా హర్భజన్ సింగ్ వ్యక్తిగత కారణాల వల్ల ఈ ఏడాది ఐపీఎల్ 2020కు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. చెన్నైకి ప్రాతినిధ్యం వహిస్తున్న భజ్జీ ఐపీఎల్‌కు దూరం కావడంతో రూ.2 కోట్లు కోల్పోనున్నాడు.(చదవండి : మేమేంటో మా ఇద్దరికి మాత్రమే తెలుసు) -
వ్యాపారితో ప్రేమేంటి?
నటి స్వాతి చెన్నైకి చెందిన వ్యాపారవేత్తతో ప్రేమాయణం సాగిస్తున్నారని, వీరి ప్రేమకు పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు ఈ ఏడాది చివరిలో ఏడడుగులకు ముహూర్తం కుదిరినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. టాలీవుడ్లో కలర్స్ స్వాతిగా ప్రాచుర్యం పొందిన ఈ తెలుగమ్మాయి తమిళంలో యువ హీరోయిన్గా గుర్తింపు పొందారు. తాజాగా మాలీవుడ్లోకి రంగప్రవేశం చేసిన ఈ బహుభాషా నటికి కల్యాణ ఘడియలు దగ్గర పడినట్లు సమాచారం. తమిళంలో సుబ్రమణిపురం చిత్రం ద్వారా పరిచయమై స్వాతి ప్రస్తుతం వడకర్రి చిత్ర విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. తన ప్రేమ, పెళ్లి విషయాల గురించి అడగ్గా అదంతా అసత్యప్రచారం అంటూ కొట్టేశారు. ఇలాంటి నిరాధార వార్తలు ఎవరు ప్రచారం చేస్తున్నారో గానీ తానెవరినీ ప్రేమించలేదని స్పష్టం చేశారు. అసలు తాను ఈ మధ్య కాలంలో చెన్నైకి రాలేదన్నారు. మూడు నెలల క్రితం వడకర్రి చిత్ర షూటింగ్ కోసం చెన్నై వచ్చానని చెప్పారు. అయితే ఇలాంటి వదంతులు ఇంతకు ముందు కూడా ప్రచారం అయ్యాయని, తాను చెన్నైకి వచ్చిన ప్రతి సారి ఇలాంటి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను కేవలం షూటింగ్ నిమిత్తమే చెన్నైకి వస్తానన్నారు. షూటింగ్లో పాల్గొంటే నటనపైనే తన పోకడ ఉంటుందన్నారు. ఒక వేళ ఏదైనా షాపింగ్ చెయ్యాలనుకుంటే యూనిట్‌లోని మిత్రులతో కలిసే వెళతానన్నారు. అలాంటిది ఎవరో ప్రచారం చేస్తున్నట్లు ఆ వ్యాపారవేత్తను కలుసుకునే అవకాశమెక్కడుంటుందని స్వాతి ఆవేశంగా ప్రశ్నిస్తున్నారు.