పండ్లరసంలో మద్యం కలిపి తాగించి..వృద్ధుడు అఘాయిత్యం | Girl Assaulted By Old Man Killed Accused Relatives Attack | Sakshi
Sakshi News home page

పండ్లరసంలో మద్యం కలిపి తాగించి.వృద్ధుడు అఘాయిత్యం

Dec 13 2022 9:51 AM | Updated on Dec 13 2022 9:56 AM

Girl Assaulted By Old Man Killed Accused Relatives Attack - Sakshi

ఒంటరిగా చిన్నారులు కనిపిస్తే చిదిమేయాలనుకునే కామాంధులు సమాజంలో పెరిగిపోయారు. అదే కోవలో ఓ పసిమొగ్గకు మాయ మాటలు చెప్పి అఘాయిత్యానికి ఒడిగట్టిన వృద్ధుడు కడతేరిపోయాడు. బాధితురాలి కుటుంబీకులు దాడి చేసి కొట్టడంతో మృత్యువాత పడ్డాడు. ఐటీ సిటీలోని హెణ్ణూరు పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

సాక్షి, బనశంకరి: మైనర్‌ బాలికకు పండ్లరసంలో మద్యం కలిపి తాగించి అత్యాచారానికి పాల్పడిన వృద్ధ కామాంధుడు బాలిక బంధువుల దాడిలో విగత జీవి అయ్యాడు. ఈ ఘటన బెంగళూరులో హెణ్ణూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. తమిళనాడుకు చెందిన కుప్పణ్ణ (72) హతుడు.  

నమ్మించి ఇంట్లోకి పిలిపించి  
సోమవారం తూర్పు విభాగం డీసీపీ భీమాశంకర్‌ గుళేద్‌ కేసు వివరాలను వెల్లడించారు.  కుప్పణ్ణ గత నాలుగేళ్లుగా హెణ్ణూరు పరిధిలోని బాబుసాపాళ్యలో ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. ఇతడు తాపీ కూలీగా పనిచేసేవాడు. ఆదివారం మధ్యాహ్నం పక్కింట్లో ఉండే నాలుగేళ్ల బాలిక ఇంటిపైన ఆరేసిన దుస్తులను తీసుకురావడానికి వెళ్లింది. అక్కడే ఉన్న కుప్పణ్ణ బాలికకు జ్యూస్‌ ఇస్తానని చెప్పి ఇంట్లోకి పిలిపించుకున్నాడు. సరేనని వెళ్లిన బాలికకు జ్యూస్‌లో మద్యం కలిపి ఇవ్వగా తాగిన బాలిక మత్తులోకి జారుకుంది. వృద్ధుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 

ఆస్పత్రి నుంచి తిరిగి వచ్చి దాడి  
సాయంత్రం వరకు బాలిక ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు గాలించారు. కుప్పణ్ణ ఉండే  ఇంటి పై అంతస్తులో బాలిక స్పృహ తప్పి ఉన్నట్లు తెలిసి బాలికను తీసుకుని ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ఏం జరిగిందో బాలిక వివరంగా చెప్పడంతో బంధువులు అగ్రహోదగ్రులయ్యారు. వెంటనే వెళ్లి కుప్పణ్ణను తీవ్రంగా కొట్టడంతో ప్రాణాలు వదిలాడు.

మరోవైపు కుప్పణ్ణ తమ బాలిక మీద లైంగిక దాడి చేశాడని హెణ్ణూరుపోలీస్‌స్టేషన్‌ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి గమనించగా కుప్పణ్ణ శవమై ఉన్నాడు. కుప్పణ్ణ పై పోక్సోయాక్టు కేసు, బాలిక కుటుంబసభ్యులపై హత్యకేసు నమోదైందని డీసీపీ తెలిపారు. హత్య కేసులో ముగ్గురిని అరెస్టు చేశామని చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement