యాడ్‌ షూటింగ్‌ కోసం వస్తే.. నీకు సిటీ చూపిస్తానని చెప్పి..! | French Women Incident In Udaipur For Ad Shoot | Sakshi
Sakshi News home page

యాడ్‌ షూటింగ్‌ కోసం వస్తే.. నీకు సిటీ చూపిస్తానని చెప్పి..!

Jun 24 2025 4:48 PM | Updated on Jun 24 2025 7:10 PM

French Women Incident In Udaipur For Ad Shoot

ఉదయ్‌పూర్‌: రాజస్థాన్‌ రాష్ట్రంలో మరో దారుణం చోటు చేసుకుంది.   ఓ యాడ్‌ షూట్‌లో భాగంగా  రాజస్థాన్‌కు వచ్చిన ఫ్రెంచ్‌ యువతికి చేదు అనుభవం ఎదురైంది. యాడ్‌ షూటింగ్‌ పేరుతో ఆమెను ఒక రూమ్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ ఉద్యోగి. 

ఆదివారం రాత్రి ఓ గ్రూప్‌తో కలిసి వచ్చిన వారంతా కలిసి డిన్నర్‌ చేశారు. అయితే ముందుగా ప్లాన్‌ చేసుకున్న సదరు ఉద్యోగి.. ఆ ఫ్రెంచ్‌ యువతికి ఉదయపూర్‌ అంతా చూపెడతానని నమ్మబలికాడు.  దాంతో నమ్మి వెళ్లిన ఆమెను ముందుగా బుక్‌ చేసి పెట్టుకున్న హోటల్‌ రూమ్‌కు తీసుకెళ్లాడు ఈఎమ్‌ ఉద్యోగి.  అనంతరం ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు పోలీసులు స్పష్టం చేశారు. యువతి ఫిర్యాదు ఆధారంగా దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ దుండగుడి కోసం వెతుకలాట ప్రారంభించారు. 

వివరాల్లోకి వెళితే..  ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ నిర్వహిస్తున్న షూటింగ్‌లో భాగంగా కొంతమంది ఉదయ్‌పూర్‌లోని బాద్‌గావ్‌ ఏరియాలోని టైగర్ హిల్స్‌లోని ఓ రెస్టారెంట్‌కు వచ్చారు.  ఫ్రెంచ్‌ మహిళతో పాటు ఇద్దరు మహిళలు షూటింగ్‌ కోసం వచ్చారని పోలీస్‌ అధికారులు తెలిపారు.

ఈ క్రమంలోనే వీరంతా డిన్నర్‌ పూర్తి చేసుకున్న తర్వాత తనను ఉద్యోగి కారులో ఎక్కించుకుని ఓ హెటల్‌కు తీసుకెళ్లాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఉదయ్‌పూర్‌ సిటీ చూపిస్తాననని చెప్పి తనపై అత్యాచారం చేశాడని యువతి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఆ యువతిని మెడికల్‌ పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించామన్నారు. ప్రస్తుతం నిందితున్ని పట్టుకునే పనిలో ఉన్నామని, సదరు హోటల్‌ రూమ్‌ సీసీ ఫుటేజ్‌ పరిశీలిస్తున్నామని ఉదయ్‌పూర్‌ ఎస్పీ యోగేష్‌ గోయల్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement