ప్రభాస్‌ మూవీలో ఛాన్స్‌ ఇప్పిస్తామని..

Fraudsters Cheats Aspiring Actors By Promise Of Roles In Prabhas Movie - Sakshi

ముంబై : సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామంటూ ఔత్సాహిక నటుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేశారు కొందరు వ్యక్తులు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. విదేశాల్లో షూటింగ్‌ జరుపుకోనున్న ప్రభాస్‌ సినిమాలో అవకాశం ఇప్పిస్తామని, ఇందుకోసం కొంత రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలని కొద్దిరోజుల క్రితం కొందరు ఔత్సాహిక నటులకు ఓ ప్రొడక్షన్‌ హౌస్‌ పేరిట మెసేజ్‌లు వచ్చాయి. దీంతో వారంతా ఆన్‌లైన్‌లోనే డబ్బులు చెల్లించి, రిజస్ట్రేషన్‌ చేయించుకున్నారు. ( ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు నాగ్‌ అశ్విన్‌ గుడ్‌ న్యూస్‌ )

తమకు పెద్ద నటుడి సినిమాలో అవకాశం రాబోతోందని సంతోషపడ్డారు. అయితే రోజులు గడుస్తున్నా ప్రొడక్షన్‌ హౌస్‌ నుంచి పిలుపురాలేదు. దీంతో గత సోమవారం ఒక్కొక్కరిగా ప్రొడక్షన్‌ హౌస్‌కు వెళ్లటం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో తమ సంస్థ పేరుతో ఎవరో మోసాలకు పాల్పడుతున్నారని గుర్తించిన యజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మోసగాళ్లు సదరు ప్రొడక్షన్‌ హౌస్‌ పేరిట నకిలీ లెటర్‌ హెడ్‌ సృష్టించి ఈ మోసాలకు పాల్పడినట్లు తేల్చారు. ఔత్సాహిక నటులనుంచి 5 వేలనుంచి 10 వేల రూపాయలు వసూలు చేసినట్లు గుర్తించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top