ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు నాగ్‌ అశ్విన్‌ గుడ్‌ న్యూస్‌ | Nag Ashwin Tells Good News For Prabhas Fans | Sakshi
Sakshi News home page

ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు నాగ్‌ అశ్విన్‌ గుడ్‌ న్యూస్‌

Jan 23 2021 1:46 PM | Updated on Jan 23 2021 7:00 PM

Nag Ashwin Tells Good News For Prabhas Fans - Sakshi

‌తమ అభిమాన హీరో మూవీపై అప్‌డేట్‌ ఇవ్వండంటూ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ వరుస ట్వీట్లతో నాగ్‌ అశ్విన్‌ను ఉక్కిరిబిక్కిరి చేశారు. దీంతో ఎట్టకేలకు నాగ్‌ అశ్విన్‌ కొత్త మూవీ అప్‌డేట్‌పై స్పందించారు.

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌ పతాకంపై ఓ భారీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  సుమారు 400 కోట్ల బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే హీరోయిన్‌గా, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

కాగా, సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా నుంచి స్పెషల్‌ అప్‌డేట్‌ ఇస్తానని చెప్పిన దర్శకుడు నాగ్‌అశ్విన్‌.. పండుగ వెళ్లి పది రోజులు కావొస్తున్నా..ఇప్పటికీ ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు. ‌తమ అభిమాన హీరో మూవీపై అప్‌డేట్‌ ఇవ్వండంటూ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ వరుస ట్వీట్లతో నాగ్‌ అశ్విన్‌ను ఉక్కిరిబిక్కిరి చేశారు. దీంతో ఎట్టకేలకు నాగ్‌ అశ్విన్‌ కొత్త మూవీ అప్‌డేట్‌పై స్పందించారు. 'కచ్చితంగా చెప్పాలంటే జనవరి 29న కానీ ఫిబ్రవరి 26న మరొక అప్‌డేట్ రాబోతుంది' అని ఫ్యాన్స్‌కు రిప్లై ఇచ్చాడు. దీంతో వాళ్లు ఫుల్ హ్యాపీ అయిపోయారు. నాగ్‌ అశ్విన్‌ ఇచ్చే అప్‌డేట్స్‌ ఏమై ఉంటాయానన్న ఆసక్తి నెలకొంది.

కాగా ప్రభాస్..‌ తాజాగా నటించిన ‘రాధేశ్యామ్’‌ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ‘సలార్‌’షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు. ఆ తర్వాత  ఓం రౌత్ దర్శకత్వంలో రాబోతున్న ఆదిపురుష్‌ షూటింగ్‌లో పాల్గొంటారు.  భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో  ప్రభాస్‌ రాముడిగా, బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ రావణుడిగా కనిపించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement