గనుల శాఖ మహిళా అధికారి హత్య

Female deputy director of Karnataka geology department found murdered - Sakshi

బనశంకరి: బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్ర గనులు, భూ విజ్ఞానశాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న కేఎస్‌ ప్రతిమ(40) అనే అధికారిణి దారుణహత్యకు గురయ్యారు. శనివారం రాత్రి 8 గంటలకు ఆమె ఆఫీసు నుంచి దొడ్డకళ్లసంద్రలోని తన అపార్టుమెంటులోని ఫ్లాటుకు చేరుకున్నారు.

కొంతసేపటికి గుర్తుతెలియని దుండగులు చొరబడి ఆమెను గొంతుకోసి, చంపి పరారయ్యారు. ఆదివారం ఉదయం ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో 8 గంటల సమయంలో స్నేహితులు వచ్చి చూశాక దారుణం వెలుగులోకి వచ్చింది. సుబ్రమణ్యనగర పోలీసులు విచారణ చేపట్టారు. ఆమె భర్త, ఇంటర్‌ చదివిన కొడుకు సొంతూరైన శివమొగ్గలోని        తీర్థహళ్లి తాలూకాలో ఉంటారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top