అబ్దుల్లాపూర్‌మెట్‌లో లారీ బీభత్సం.. ఇంజనీరింగ్‌ విద్యార్థి మృతి | Engineering Student Died In Road Accident at Abdullapurmet | Sakshi
Sakshi News home page

అబ్దుల్లాపూర్‌మెట్‌లో లారీ బీభత్సం.. ఇంజనీరింగ్‌ విద్యార్థి మృతి

Dec 11 2021 5:15 PM | Updated on Dec 11 2021 6:25 PM

Engineering Student Died In Road Accident at Abdullapurmet - Sakshi

సాక్షి, రంగారెడ్డి : జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఓ లారీ బీభ‌త్సం సృష్టించింది. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీ అబ్దుల్లాపూర్‌మెట్‌ కూడలి వద్దకు రాగానే అదుపుత‌ప్పి పాదాచారుల‌పై దూసుకెళ్లింది. ఓ బుల్లెట్ బైక్‌ను కూడా ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో బుల్లెట్‌పై ఉన్న‌ విజ్ఞాన్ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థి మృతి చెందాడు. మ‌రొక‌రికి తీవ్ర గాయాల‌య్యాయి. మృతుడు సిరిసిల్లా జిల్లా ప్రగతి నగర్‌కు  చెందిన ప్రణయ్‌ గౌడ్‌(20)గా గుర్తించారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. బ్రేకులు ఫెయిల్ కావ‌డంతోనే లారీ అదుపు త‌ప్పిన‌ట్లు పోలీసులు ప్రాథ‌మికంగా నిర్ధారించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement