HYD: పబ్బుల్లో డ్రగ్స్‌.. యువతులు అరెస్ట్‌ | Hyderabad Police Arrest Drug Selling Gang - Sakshi
Sakshi News home page

HYD: పబ్బుల్లో డ్రగ్స్‌.. యువతులు అరెస్ట్‌

Feb 3 2024 6:32 PM | Updated on Feb 3 2024 7:13 PM

Drug Selling Gang Arrested In Hyderabad Pubs - Sakshi

పబ్బుల్లో డ్రగ్స్‌ అమ్ముతున్న ఆరుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

సాక్షి, హైదరాబాద్‌: పబ్బుల్లో డ్రగ్స్‌ అమ్ముతున్న ఆరుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మాదాపూర్‌, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్‌లోని పబ్‌ల్లో డ్రగ్‌ విక్రయాలు చేస్తున్నారు. మాదాపూర్‌లోని నోవాటెల్ ఆర్టిస్ట్రీ, ఎయిర్ లైవ్‌, క్లబ్ రౌగ్, క్లబ్ రాక్ పబ్బుల్లో డ్రగ్స్ దందా సాగిస్తున్నారు. 

బెంగళూరు, ముంబై, గోవా నుంచి డ్రగ్స్‌ తెచ్చి పబ్బుల్లో విక్రయిస్తున్న మహిళల నుంచి 10 గ్రాముల ఎండీఎంఏతో పాటు కొకైన్‌ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌ అమ్ముతున్న మిథున, కొంగాల ప్రియలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

వీరితో పాటు మరో నలుగురు కలిసి గత కొంతకాలం నుంచి డ్రగ్స్ అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరంతా బెంగళూరు, ముంబై, గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతున్నట్లు గుర్తించారు. డ్రగ్స్‌ సప్లయర్స్‌ ఉస్మాన్‌, అజీం, అబ్దుల్లా పరారీలో ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement