ఇంటి నుంచి పారిపోయి వెళ్లి పెళ్లి చేసుకొని.. రైలుపట్టాలపై.. | Couple Bodies found on railway track at suicide | Sakshi
Sakshi News home page

ఇంటి నుంచి పారిపోయి వెళ్లి పెళ్లి చేసుకొని.. రైలుపట్టాలపై..

Nov 25 2022 7:56 AM | Updated on Nov 25 2022 7:56 AM

Couple Bodies found on railway track at suicide - Sakshi

ఆత్మహత్య చేసుకున్న నాగేంద్ర, యువతి

సాక్షి, యశవంతపుర: బెంగళూరు చిక్కబాణవార సమీపంలోని హుస్కూరు గ్రామం వద్ద ప్రేమ జంట రైలు కింద పడి అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. మృతుడు నాగేంద్ర (21) కాగా, యువతి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల ఇద్దరూ ఇళ్లు వదిలి వెళ్లి పెళ్లి చేసుకొన్నారు.

చిక్కబాణవార–గొల్లహళ్లి రైల్వేస్టేషన్ల మధ్య హుస్కూరు రైల్వేస్టేషన్‌ వద్ద పట్టాలపై ఇద్దరి శవాలను రైల్వే పోలీసులు కనుగొన్నారు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. యశవంతపుర పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.  

 చదవండి: (భర్త వివాహేతర సంబంధం.. భార్యకు తెలిసి..)

Advertisement
 
Advertisement
Advertisement