మొబైల్‌ చూడొద్దని మందలించారని... | Child Committed Suicide Not Looking At Her Mobile Phone | Sakshi
Sakshi News home page

మొబైల్‌ చూడొద్దని మందలించారని...

Feb 4 2023 8:44 AM | Updated on Feb 4 2023 8:44 AM

Child Committed Suicide Not Looking At Her Mobile Phone - Sakshi

చిన్నారి నవ్వ ఓజా దూకిన అపార్ట్‌మెంట్‌

సాక్షి బెంగళూరు: మొబైల్‌ చూడొద్దని తల్లిదండ్రులు హెచ్చరించినందుకు బాలిక మనస్తాపానికి గురై పదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. వివరాలు..బెంగళూరు ఈశాన్య విభాగం బాగలూరు పోలీసు స్టేషన్‌ పరిధిలోని కణ్ణూరులోని అపార్ట్‌మెంట్‌లో రవికుమార్‌ ఓజా అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు.

ఈయన కుమార్తె నవ్య ఓజా (13) ఏడో తరగతి చదువుతోంది. నవ్య ఎక్కువగా మొబైల్‌ చూస్తుండడంతో చదువుపై దృష్టి సారించాలని తల్లిదండ్రులు గురువారం రాత్రి పది గంటల సమయంలో  మందలించారు. పది నిమిషాల అనంతరం బాలిక అపార్టుమెంట్‌పైకి వెళ్లి కిందకి దూకి ఆత్మహత్య చేసుకుంది. బాగలూరు పోలీసులు కేసు నమోదు చేశారు.  

(చదవండి: వాహనదారులకు బంపర్ ఆఫర్.. చలాన్లపై 50 శాతం డిస్కౌంట్..!)

Advertisement
 
Advertisement
Advertisement