వ్యభిచారం దందా బట్టబయలు.. బాడుగ ఇళ్లు తీసుకుని | Bangalore: Police Arrested Bangladeshi Nationals For Prostitution | Sakshi
Sakshi News home page

వ్యభిచారం దందా బట్టబయలు.. బాడుగ ఇళ్లు తీసుకుని

Published Sun, Dec 18 2022 10:50 AM | Last Updated on Sun, Dec 18 2022 10:56 AM

Bangalore: Police Arrested Bangladeshi Nationals For Prostitution - Sakshi

యశవంతపుర(బెంగళూరు): బెంగళూరులో బాడుగ ఇళ్లు తీసుకుని వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న 8 మంది బంగ్లాదేశ్‌వాసుల్ని సీసీబీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కెంగేరి, సోలదేవనహళ్లి రెండు చోట్ల దాడులు జరిపి ఇద్దరు మహిళలు, ఆరుమంది పురుషులను అరెస్ట్‌ చేశారు.

ప్రాథమిక విచారణ­లో తాము భారతీయులమంటూ బాడుగ ఇళ్లు తీసు­కొని మహిళలను, విటులను రప్పించి పడుపు వృత్తి చేయిస్తున్నారు. పశ్చిమ బెంగాల్, త్రిపుర పౌరులమని ఇంటి యజమానులకు ఆ­ధార్‌ కార్డులను చూపారు. పోలీసుల విచారణలో బంగ్లాదేశ్‌లో కరోనా టీకా వేయించుకున్న సర్టిఫికెట్లతో పాటు భారతీయులు కాదని నిరూపించే ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

చదవండి: హనీమూన్‌లో విషాదం.. వివాహమై 20 రోజులు కాకుండానే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement