వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడిపై టీడీపీ కార్యకర్తల హత్యాయత్నం | Attempted assassination of YSRCP mandal president by TDP workers | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడిపై టీడీపీ కార్యకర్తల హత్యాయత్నం

Aug 16 2022 5:27 AM | Updated on Aug 16 2022 5:27 AM

Attempted assassination of YSRCP mandal president by TDP workers - Sakshi

పల్లెర్లమూడిలో గొడవపడుతున్న ఇరువర్గాలు

నూజివీడు: ఏలూరు జిల్లా నూజివీడు మండలం పల్లెర్లమూడికి చెందిన వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పోలిమెట్ల శివను హత్య చేసేందుకు అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. గాయపడిన శివను స్థానికులు ఏరియా ఆస్పత్రికి తరలించారు. రూరల్‌ ఎస్‌ఐ ఎం.లక్ష్మణ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పోలిమెట్ల శివకు, మరికొందరికి పొలాల వద్ద గతంలో గొడవలున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఆరుగంటల సమయంలో కొందరు వ్యక్తులు శివపై దాడిచేసి హత్యచేసేందుకు ఆయన ఇంటివద్దకు కత్తులు, ఇనుపరాడ్లు తీసుకుని వెళ్లారు.

అక్కడే ఉన్న పలువురు వారిని అడ్డగించి పంపించేశారు. తరువాత ఇంటిబయట మళ్లీ గొడవపడి శివ మీద దాడిచేశారు. గాయపడిన శివ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామానికి చెందిన అట్లూరి హనుమంతరావు, అట్లూరి బ్రహ్మంచౌదరి, కొక్కెరపాటి వెంకటేశ్వరరావు, మరో ఐదుగురు తనపై హత్యాయత్నం చేశారని బాధితుడు శివ రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ ఎస్‌ఐ చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement