హత్యాయత్నం కేసులో నిందితుడికి రిమాండ్‌

Assassination Attempted On Perni Nani: Court Remanded To Accused - Sakshi

సాక్షి, కృష్ణా జిల్లా: రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నానిపై హత్యాయత్యానికి పాల్పడిన నిందితుడికి జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. నిందితుడిని మచిలీపట్నం స్పెషల్ సబ్ జైలుకు పోలీసులు తరలించారు. విచారణలో నిందితుడు మద్యం సేవించలేదని పోలీసులు తేల్చారు. (చదవండి: మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం)

మంత్రి పేర్ని నాని పై ఆదివారం ఉదయం హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. బడుగు నాగేశ్వరరావు అనే టీడీపీ కార్యకర్త పదునైన సన్నపాటి తాపీ (భవన నిర్మాణాల సందర్భంగా మేస్త్రీలు ఉపయోగించే పనిముట్టు)తో మంత్రిని రెండుసార్లు పొడవగా.. ఆయన అదృష్టవశాత్తు తప్పించుకున్నారు. నిందితుడు నాగేశ్వరరావుపై సెక్షన్‌ 307 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. (చదవండి: పేర్నినానిపై హత్యాయత్నం: కొత్త కోణం..)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top