breaking news
remanded for 14 days
-
పోసానికి 14 రోజుల రిమాండ్
సాక్షి, రాయచోటి/రైల్వేకోడూరు అర్బన్/రాజంపేట రూరల్ : సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళికి అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మెజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించారు. గురువారం రాత్రి 9 గంటలకు పోలీసులు కృష్ణ మురళిని మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. పదేళ్ల క్రితం నంది అవార్డును తిరస్కరిస్తూ పోసాని చేసిన వ్యాఖ్యలపై స్థానిక జనసేన నేత ఫిర్యాదు మేరకు ఆయనపై అక్రమ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోసాని తరఫున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లను ప్రస్తావిస్తూ, ఈ సెక్షన్లు ఆయనకు వర్తించవని వివరించారు. సంబంధం లేని సెక్షన్లతో పాటు అనవసర సెక్షన్లు పెట్టారని వాదించారు. ప్రభుత్వ న్యాయవాదులు కూడా ఈ కేసుకు సంబం«ధించి తమ వాదనలు వినిపించారు. దాదాపు 9.30 గంటలకు ప్రారంభమైన వాదనలు తెల్లవారుజాము వరకు కొనసాగాయి. ఈ పరిణామాలపై కోర్టు బయట పోసాని అభిమానులతోపాటు వైఎస్సార్సీపీ నేతల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఇరుపక్షాల వాదనలు ఆలకించిన మెజిస్ట్రేట్ సాయితేజ్.. తెల్లవారుజామున పోసానికి 14 రోజుల రిమాండును విధించారు. అనంతరం పోసానిని రైల్వేకోడూరు సీఐ పి.వెంకటేశ్వర్లు, ఓబులవారిపల్లి ఎస్ఐ పి.మహేష్‌నాయుడులు తమ సిబ్బందితో ఉదయం 7.52 గంటలకు నేరుగా రాజంపేట సబ్ జైలు వద్దకు తీసుకొచ్చారు. జైలులో ఆయనకు 2261 నంబరు కేటాయించారు. ఇదే సమయంలో జిల్లా జైళ్ల శాఖ ఉప అధికారి హుస్సేన్‌రెడ్డి ఈ జైల్‌ను సందర్శించారు. న్యాయ పోరాటం చేస్తాం : పొన్నవోలుపోసానికి రిమాండు విధించిన అనంతరం కోర్టు నుంచి బయటికి వచ్చిన పొన్నవోలు మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అన్నివేళలా అందుబాటులో ఉంటామని చెప్పారు. అక్రమ కేసులపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలన్నారు. ఆయన వెంట మాజీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర నేత జల్లా సుదర్శన్‌రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ నాగిరెడ్డి తదితరులు ఉన్నారు.బెయిల్ కోసం దరఖాస్తుపోసాని కృష్ణ మురళీకు బెయిల్ కోసం రైల్వేకోడూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో న్యాయవాది నాజ్జాల మధు పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో సోమవారం వాదనలు వినిపించనున్నారు. రైల్వేకోడూరు రూరల్ సీఐ వెంకటేశ్వర్లు, ఓబులవారిపల్లి ఎస్ఐ మహేష్‌లు పోసాని విచారణ నిమిత్తం కస్టడీ కోసం కోర్టులో పిటిషన్ వేశారు. ఇదిలా ఉండగా పోసాని కృష్ణ మురళి ఆరోగ్యం క్షీణించిందని ఆయన స్నేహితులు లింగంగుట్ల సల్మాన్‌రాజ్, షేక్ నాగూర్ బాషా ఆందోళన వ్యక్తం చేశారు. రాజంపేట సబ్ జైల్లో శుక్రవారం ములాఖత్ సమయంలో వారు పోసానిని కలిశారు. అనంతరం సబ్ జైల్ వద్ద మీడియాతో మాట్లాడుతూ గంటల కొద్దీ ప్రయాణం చేయటం వల్ల పోసాని అనారోగ్యానికి గురైనట్లు తెలిపారు. రెండు రోజులుగా విశ్రాంతి లేకపోవడంతో ఆరోగ్యం మరింత క్షీణించిందన్నారు. పోసాని కడుపు నొప్పి, విరేచనాలతో బాధ పడుతున్నారని తెలిపారు. తాము టాబ్లెట్లు ఇవ్వబోగా.. తమ డాక్టర్ ఉన్నారని జైలర్ అభ్యంతరం తెలిపారన్నారు.పోసానిపై 111 సెక్షన్ తొలగింపురాష్ట్ర వ్యాప్తంగా పోసానిపై అక్రమంగా 15కు పైగా కేసులు బనాయించారని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు పాటూరు భరత్‌కుమార్‌రెడ్డి తెలిపారు. పోసాని మీద 111, ఆర్/డబ్ల్యూ3(5) ఆఫ్ బీఎన్ఎస్, 196, 35(2), ఐటీ 67 యాక్ట్–2023 ప్రకారం అక్రమ కేసులు బనాయించారని చెప్పారు. ఈ రిమాండ్ అక్రమమని, దీనికి ఈ సెక్షన్లు ఏ మాత్రం వర్తించవని కోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. సుదీర్ఘ వాదనల అనంతరం కోర్టు డిఫెన్స్ వాదనలతో ఏకీభవించి 111 బీఎన్ఎస్ అనేది తీవ్రమైన సెక్షన్ అని భావించి, అది ఈ కేసులో వర్తించదని తొలగించిందని తెలిపారు. 111 సెక్షన్ మినహా మిగిలిన సెక్షన్లు అన్నీ బెయిలబుల్ అఫెన్స్ మాత్రమేనన్నారు. ఈ కేసులే కాకుండా ఇంకా చాలా కేసులు ఉండటం వల్ల కోర్టు రిమాండ్ విధించిందన్నారు. -
పేర్ని నానిపై హత్యాయత్నం: నిందితుడికి రిమాండ్
సాక్షి, కృష్ణా జిల్లా: రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నానిపై హత్యాయత్యానికి పాల్పడిన నిందితుడికి జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నిందితుడిని మచిలీపట్నం స్పెషల్ సబ్ జైలుకు పోలీసులు తరలించారు. విచారణలో నిందితుడు మద్యం సేవించలేదని పోలీసులు తేల్చారు. (చదవండి: మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం) మంత్రి పేర్ని నాని పై ఆదివారం ఉదయం హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. బడుగు నాగేశ్వరరావు అనే టీడీపీ కార్యకర్త పదునైన సన్నపాటి తాపీ (భవన నిర్మాణాల సందర్భంగా మేస్త్రీలు ఉపయోగించే పనిముట్టు)తో మంత్రిని రెండుసార్లు పొడవగా.. ఆయన అదృష్టవశాత్తు తప్పించుకున్నారు. నిందితుడు నాగేశ్వరరావుపై సెక్షన్ 307 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. (చదవండి: పేర్నినానిపై హత్యాయత్నం: కొత్త కోణం..) -
అగ్ని ప్రమాదం ఘటన.. నిందితులకు రిమాండ్
సాక్షి, విజయవాడ: స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం ఘటనలో అరెస్టయిన ముగ్గురు నిందితులను న్యాయమూర్తి ముందు పోలీసులు హజరు పరిచారు. ఆస్పత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) డాక్టర్ కొడాలి రాజగోపాలరావు, స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ ఇన్చార్జి, ఆస్పత్రి జీఎం డాక్టర్ కె.సుదర్శన్, కోవిడ్ కేర్ సెంటర్ కోఆర్డినేటింగ్ మేనేజర్ పల్లెపోతు వెంకటేశ్‌లకు 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితులను మచిలీపట్టణం స్పెషల్ సబ్ జైలుకు పోలీసులు తరలించారు. (నిలువెత్తు నిర్లక్ష్యం) విజయవాడ రమేశ్ ఆస్పత్రి.. హోటల్ స్వర్ణ ప్యాలెస్‌లో నిర్వహిస్తున్న ప్రైవేటు కోవిడ్ కేర్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాదానికి కారణం యాజమాన్యం నిర్లక్ష్యం, కనీస భద్రతా చర్యలు లేకపోవడమేనని అధికారులు చెబుతున్నారు. సోమవారం అధికారులు, పోలీసులతో కూడిన మూడు ప్రత్యేక బృందాలు స్వర్ణ ప్యాలెస్‌తో సహా రమేశ్ ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహించాయి. నగరపాలక సంస్థ మార్గదర్శకాల ప్రకారం.. భవన నిర్మాణం జరగకపోవడం, అధికంగా పేషెంట్లను చేర్చుకోవడం, రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేయడం, తదితర లోపాలను తనిఖీ బృందాలు గుర్తించాయి. -
కసాయి సవతి తల్లికి 14 రోజుల రిమాండు
కూతురని కూడా చూడకుండా యాసిడ్ పోసి.. సున్నం నీళ్లు తాగించిన కేసులో.. సవతి తల్లి శ్యామలను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను రంగారెడ్డి జిల్లా కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు ఆమెకు 14 రోజుల రిమాండు విధించింది. ఎల్బీనగర్ సమీపంలోని బండ్లగూడ ఆనంద్‌నగర్‌కు చెందిన బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి రమేష్‌కు మొదటి భార్య విడాకులిచ్చింది. దీంతో కూతురు ప్రత్యూషను అనాథాశ్రమంలో చేర్పించి... శ్యామలను రెండో పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజుల క్రితం ఆశ్రమం నుంచి కూతురిని ఇంటికి తెచ్చుకున్నాడు. కూతురిని కంటికి రెప్పలా చూసుకోవాల్సింది పోయి.. ఇంట్లో పనిమనిషిగా చేసేశాడు. రెండో భార్య శ్యామల కూడా ఆ అమ్మాయికి నరకం చూపించింది. ఏదో ఒక కారణంతో అమ్మాయిని గదిలో బంధించి.. కర్కశంగా కర్రలు, వైర్లతో కొట్టి.. సిగరెట్లతో కాల్చేది. అంత చేస్తున్నా.. ఆ కసాయి తండ్రి మాత్రం చూస్తూనే ఉండిపోయేవాడు. కొట్టడంతో మాత్రమే సరిపెట్టకుండా.. సర్ఫ్, సున్నం నీళ్లు తాగించేవారని, బాత్రూంకు వెళ్లాల్సి వచ్చినా వెళ్లనిచ్చేవారు కారని ప్రత్యూష కన్నీటి పర్యంతమైంది. ఆమె చివరకు పోలీసులను ఆశ్రయించడంతో.. వారు సవతి తల్లిని అరెస్టుచేసి కోర్టులో ప్రవేశపెట్టారు.