Ahmedabad: గుజరాత్‌ వర్సిటీలో విదేశీ విద్యార్థులపై దాడి | Assailants Attacked On Foreign Students In Gujarat University | Sakshi
Sakshi News home page

గుజరాత్‌ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులపై దాడి

Mar 17 2024 9:21 AM | Updated on Mar 17 2024 10:19 AM

Assailants Attacked On Foreign Students In Gujarat University - Sakshi

అహ్మదాబాద్‌: గుజరాత్‌ రాజధాని అహ్మదాబాద్‌లోని గుజరాత్‌ యూనివర్సిటీలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడి ఘటన శనివారం రాత్రి జరిగింది. విదేశీ స్టూడెంట్స్‌పైకి రాళ్లు విసరడమే కాకుండా హాస్టల్‌ గదిని కూడా ధ్వంసం చేశారు. దాడిలో గాయపడ్డ విద్యార్థులను సమీపంలోని ఎస్‌వీపీ ఆస్పత్రిలో చేర్చించి చికిత్స అందిస్తున్నారు. 

దాడితో అప్రమత్తమైన పోలీసులు యూనివర్సిటీ గేట్లన్నీ మూసివేశారు. విదేశీ విద్యార్థులపై దాడి చేసింది ఎవరనేది తేల్చేందుకు దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ ఘటనపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఎక్స్‌(ట్విటర్‌)లో స్పందించారు. ఈ విషయంలో ప్రధాని మోదీ, అమిత్‌ షా స్పందించాలని డిమాండ్‌ చేశారు. ఈ తరహా ఘటనలు ప్రపంచంలో భారత్‌  ప్రతిష్టను దెబ్బతీస్తాయన్నారు. 

ఇదీ చదవండి.. కశ్మీర్‌ వేర్పాటువాద గ్రూపులపై నిషేధం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement