Ameerpet: Man Cheated Woman To give Bail To Husband, Molested Viral - Sakshi
Sakshi News home page

Ameerpet: భర్తకు బెయిల్‌ ఇప్పిస్తానని.. ఓయో లాడ్జికి రప్పించి

Jan 13 2022 11:45 AM | Updated on Jan 13 2022 1:20 PM

Ameerpet: Man Cheated Woman To give Bail To Husband, Molested - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

Ameerpet: జైలులో ఉన్న భర్తకు బెయిల్‌ ఇప్పిస్తానని నమ్మించి ఇంటికి వచ్చిన ఓ వ్యక్తి కత్తితో మహిళను బెదిరించి లైంగికదాడికి పాల్పడిన సంఘటన ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్పెక్టర్‌ సైదులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బాలానగర్‌కు చెందిన మహిళ అదే ప్రాంతానికి చెందిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. బాలానగర్‌కు చెందిన ఆటో డ్రైవర్‌ ఎం.డి.జహంగీర్‌ ఆమె భర్తతో స్నేహం ఉండటంతో తరచూ ఇంటికి వచ్చేవాడు. గత ఏడాది గంజాయి కేసులో ఆమె భర్త జైలుకు వెళ్లాడు.
చదవండి: కన్నతల్లి దాష్టీకం.. కొడవలితో నరికి చిన్నారి హత్య 

ఆ సమయంలో ఇంటికి వచ్చిన జహంగీర్‌ నీ భర్తకు బెయిల్‌ ఇప్పిస్తానని, న్యాయవాదిని కూడా తానే ఏర్పాటు చేస్తానని చెప్పాడు. లాయర్‌తో మాట్లాడాలని ఎస్‌ఆర్‌నగర్‌లోని ఎస్‌వీఆర్‌ ఓయో లాడ్జికి రప్పించి ఆమెను కత్తితో బెదిరించి లైంగిక పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెపితే నీ కుమారుడితో పాటు భర్తను చంపుతానని బెదిరించాడు. గత కొద్ది రోజులుగా జహంగీర్‌ లైంగిక వేధింపులకు పాల్పడుతుండటంతో బాధితు రాలు బాలానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు కేసును ఎస్‌ఆర్‌నగర్‌కు బదిలీ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. 
చదవండి: మరో మహిళతో సఖ్యత.. భారీ స్కెచ్‌.. డామిట్‌ కథ అడ్డం తిరిగింది..

Advertisement
 
Advertisement
Advertisement