దళితబంధు రావడం లేదని బలవన్మరణం? | Sakshi
Sakshi News home page

దళితబంధు రావడం లేదని బలవన్మరణం?

Published Fri, Nov 3 2023 12:46 PM

Adilabad Bhoraj Man Commits Suicide Case Details - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: దళిత బందు పథకం  కోసం ఓ యువకుడి అత్మహత్య చేసుకున్న  ఉదంతం జిల్లాలో చోటు చేసుకుంది. జైనథ్‌ మండలం బోరజ్‌కు చెందిన రమాకాంత్ అనే యువకుడు పురుగుల‌ మందు త్రాగి ‌అత్మహత్య చేసుకున్నాడు. స్పాట్‌లో ఓ లేఖ దొరికింది. తాను దళితబంధు కోసం దరఖాస్తు  చేసుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందని రమాకాంత్‌ పేరిట ఆ లేఖ ఉంది. కుటుంబ సభ్యుల ప్రస్తావనతో పాటు తన ఆత్మహత్యకు సీఎం కేసీఆర్ కారణమంటూ  లేఖలో ప్రస్తావించాడు రమాకాంత్‌. కొడుకు కోల్పోయిన దుఃఖంలో ఉన్న ఆ తల్లిదండ్రులు తమను ఆదుకోవాలని సర్కార్‌ను కోరుతున్నారు. అయితే ఈ ఘటనపై ఇంకా పోలీసులకు ఫిర్యాదు అందలేదని సమాచారం. 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement