మాదాపూర్‌ పీఎస్‌పై ఏసీబీ దాడులు.. పట్టుబడ్డ ఎస్సై | Sakshi
Sakshi News home page

మాదాపూర్‌ పీఎస్‌పై ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్సై

Published Sat, Apr 6 2024 3:13 PM

ACB Raids At Madhapur Police Station, SI Caught Red-Handed - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌ పరిధిలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో శనివారం(ఏప్రిల్‌ 6) ఏసీబీ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఎస్సై రంజిత్‌, రైటర్‌ విక్రమ్‌ ఏసీబీ పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. 

వీరిద్దరిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ పోలీసులు లంచం వ్యవహారంపై విచారిస్తున్నారు. మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న సిబ్బంది అవినీతి వ్యవహారంపై రెండు రోజులుగా ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు. ఇందులో భాగంగా ఎస్సై, రైటర్‌ అవినీతి వ్యవహారం బయటపడింది. 

ఇదీ చదవండి.. కేబుల్‌ బ్రిడ్జిపై హిట్‌ అండ్‌ రన్‌  

Advertisement
 
Advertisement