5 Year Old Kerala Girl Rape And Murder Case - Sakshi
Sakshi News home page

కేరళలో అమానుషం.. ఐదేళ్ల చిన్నారిని రేప్ చేసి హత్య..

Jul 30 2023 12:33 PM | Updated on Jul 30 2023 12:53 PM

5-Year Old Kerala Girl Rape And Murder Case - Sakshi

తిరువనంతపురం: కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో ఓ వలస కార్మికుడు ఐదేళ్ల చిన్నారిని రేప్ చేసి చంపి గోనుసంచిలో కుక్కిన ఘటన సంచలనం రేపింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అదేరోజు అదుపులోకి తీసుకున్న పోలీసులు. 

ఎర్నాకుళం ఎస్పీ వివేక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం బీహార్ నుండి వచ్చి ఇక్కడ పనులు చేసుకుంటున్న ఓ జంట తమ కూతురు కనిపించడంలేదని శనివారం సాయంత్రం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వెంటనే రెండు బృందాలుగా విడిపోయి ఒక బృందం పాప కోసం గాలించగా మరో బృందం స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించే పనిలో పడ్డారు. కొద్దిసేపు పరిశీలించిన తరవాత సీసీటీవీ ఫుటేజిలో కీలక ఆధారాలు బయటపడ్డాయి. అందులో అదే ఇంటికి పై పోర్షన్లో ఉండే బీహార్ కు చెందిన అస్ఫాక్ అస్లామ్ పాపను శనివారం సాయంత్రం 6.30 ప్రాంతంలో ఎత్తుకెళ్ళడం గమనించడం జరిగింది. 

వెంటనే అదేరోజు రాత్రి 9.30 గంటలకు అతడిని అదుపులోకి తీసుకున్నాం. కానీ అతడు మద్యం మత్తులో పూర్తిగా అపస్మారక స్థితిలో ఉన్నందున రాత్రంతా విచారించాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఆదివారం ఉదయాన్న అతడు నేరాన్ని అంగీకరించాడని తెలిపారు.

అస్ఫాక్ అస్లామ్ చిన్నారిని తీసుకుని వెళ్తుండడం స్థానికంగా ఉన్న మరొక వ్యాపారి కూడా చూశానని చెప్పడంతో తమ అనుమానం నిజమైందని.. మా శైలిలో విచారణ జరిపించగా మద్యం మత్తులో బాలికపై అమానుషంగా బలాత్కారం చేసి, చంపి పక్కనే ఉన్న బురదలో పడేసి పైకి కనిపించకుండా గోనె సంచులను కప్పినట్లు అతడు నేరాన్ని అంగీకరించాడన్నారు. బాలికను సజీవంగా ఇవ్వలేకపోతున్నందుకు ఆ కుటుంబానికి ఎస్పీ క్షమాపణ చెప్పారు. 

ఇది కూడా చదవండి: కాశ్మీర్‌లో సెలవుపై వచ్చిన భారత జవాను అదృశ్యం  
 

Advertisement
 
Advertisement
Advertisement