గడ్చిరోలి: మావోయిస్టులకు భారీ దెబ్బ | 4 Maoists Killed In Gadchiroli Eccounter | Sakshi
Sakshi News home page

గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టు అగ్రనేతలు మృతి

Mar 19 2024 9:25 AM | Updated on Mar 19 2024 12:57 PM

4 Maoists Killed In Gadchiroli Eccounter - Sakshi

గడ్చిరోలి జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టు అగ్రనేతలు చనిపోయారు.. 

సాక్షి, గడ్చిరోలి: తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో మంగళవారం(మార్చి 19) తెల్లవారుజామున భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్ట్‌ అగ్రనేతలు మృతి చెందారు. మిగిలిన మావోయిస్టుల కోసం పోలీసుల  కూంబింగ్‌ కొనసాగుతోంది.

గడ్చిరోలిలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ చేస్తున్న  పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడ్డప్పుడు కాల్పులు ‍ జరిగాయి.  ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. చనిపోయిన వారంతా మావోయిస్టు అగ్రనేతలని.. తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులని అధికారులు ధృవీకరించారు. మంచిర్యాల డివిజన్‌ కమిటీ సెక్రటరీ వర్గీస్‌, చెన్నూరు ఏరియా కమిటీ సెక్రటరీ మగ్తూ, కుర్సంగ్‌ రాజు, కుడిమెట్ట వెంకటేశ్‌ ఉన్నారు. 

ఇదిలా ఉంటే.. కాల్పుల్లో చనిపోయిన మావోయిస్టులపై రూ. 36 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా  పోలీసులు భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.  

ఇదీ చదవండి.. ప్రాణం పోస్తారనుకుంటే తీశారు
 

Advertisement
 
Advertisement
Advertisement