నల్లగొండ జిల్లాలో దారుణం.. బస్సు కోసం చూస్తున్న బాలికను వస్త్ర దుకాణంలోకి పిలిచి..

13 Years Old Girl Molested by 3 Young Men In Nalgonda - Sakshi

సాక్షి, నల్లగొండ: కామాంధుల అకృత్యానికి ఓ బాలిక బలైన దారుణ ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పదో తరగతి చదువుతున్న హైదరాబాద్‌కు చెందిన బాలిక సంక్రాంతి పండుగకు ఈ నెల 13న పీఏపల్లి మండలంలో ఉంటున్న అమ్మమ్మ ఇంటికి వచ్చింది. తిరిగి మంగళవారం హైదరాబాద్‌కు వెళ్లేందుకు బయల్దేరింది. పెద్ద అడిశర్లపల్లి మండలం వడ్డెరిగూడేనికి చెందిన యువకులు నరేశ్, శివ, దిలీప్‌లో కారులో అంగడిపేట క్రాస్‌రోడ్డు వద్దకు వెళ్తుండగా పరిచయస్తులే కావడంతో అక్కడి వరకు వస్తానని బాలిక వారి కారు ఎక్కింది.

క్రాస్‌రోడ్డు వద్ద కారు దిగిన బాలిక హైదరాబాద్‌ వెళ్లేందుకు బస్సు కోసం ఎదురుచూస్తుండగా బస్టాప్‌ ఎదురుగానే నరేశ్‌కు వస్త్ర దుకాణం ఉంది. ఎండలో బస్సు కోసం చూస్తున్న బాలికను అతను తన వస్త్ర దుకాణంలోకి పిలిచాడు. అప్పటికే మిగిలిన ఇద్దరు యువకులూ అదే దుకాణంలోనే ఉన్నారు. కొంత సమయం తర్వాత బాలిక స్పృహ తప్పిపోయిందని ముగ్గురు యువకులూ స్థానిక డాక్టరుకు చూపించగా దేవరకొండకు తీసుకెళ్లాలని సూచించారు. వెంటనే వారు అక్కడికి తరలించగా బాలిక అప్పటికే మృతిచెందిందని డాక్టర్లు నిర్ధారించారు.

దీంతో నరేశ్, శివ, దిలీప్‌లు పరారయ్యేందుకు యత్నించగా స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించగా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దేవరకొండ డీఎస్పీ నాగేశ్వర్‌రావు మృతదేహాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. ముగ్గురు యువకులూ బాలికపై అత్యాచారం చేయడంతోనే తీవ్ర రక్తస్రావంతో మృతిచెందిందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. కాగా, తన కూతురును అఘాయిత్యం చేసి హత్య చేశారంటూ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  
చదవండి: పనికోసం నమ్మి వెళ్తే.. ‘బీమా’ ప్లాన్‌లో శవమయ్యాడు.. పాపం ఆ డ్రైవర్‌!

మరిన్ని వార్తలు :

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top