జగనన్న హయాంలో బీసీలకు సముచిత స్థానం లభించింది. బీసీ కులాల కార్పొరేషన్లు, ఇతర పదవుల్లో అనేక మందికి స్థానం కల్పించారు. పక్కాగా రిజర్వేషన్లు అమలు చేశారు. బీసీలను అడ్డం పెట్టుకుని ఓట్లు కొట్టేయాలని టీడీపీ కుటీల యత్నానికి కోర్డు తీర్పు చెంపపెట్టులా మారింది.
–చంద్రశేఖర్, మాజీ డిప్యూటీ మేయర్, బీసీనాయకులు, చిత్తూరు
కోర్టుల్లో నిలబడదని తెలిసినా..
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఆర్డినెన్స్, జీవోలు తీసుకురావడం ఓట్ల కోసమే అని తేలిపోయింది. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉంటే కోర్టు ల్లో నిలబడవని సుప్రీం కోర్టు తీర్పుల ద్వారా తెలిసినా, సరైన న్యాయ సలహాలు తీసుకోకుండా అడ్డగోలుగా జీవోలు ఇచ్చారు. కోర్టు కొట్టేయగానే చేతులెత్తేశారు. –జ్ఞానజగదీష్, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం(జేఏసీ) అధ్యక్షుడు
డ్రామా ఆడారు
రిజర్వేషన్లు పెంచాలనే చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగబద్ధమైన ప్రక్రియను ఎందుకు అనుసరించలేదు? చట్టపరమైన ప్రాతిపదిక, సరైన డేటా లేకుండా జీవోలు ఇచ్చి బీసీలకు మేలు చేస్తున్నట్లు హంగామా చేశారు. కోర్టు కొట్టేస్తుందని ముందే ఊహించి, ఆ నిందను కోర్టులపై నెట్టేసేందుకు ఆడిన నాటకమిది. – త్యాగరాజులు, బీసీనాయకులు, చిత్తూరు
బీసీల హక్కును కాలరాశారు
రాష్ట్రంలో మెజారిటీ జనాభా ఉన్న బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ దక్కకుండా చేయడం బాధాకరం. ఎన్నికలు సకాలంలో జరపకుండా వాయిదా వేస్తూ వచ్చి, చివరికి కోర్టుల్లో నిలబడని జీవోలు తేవడం ద్వారా బీసీలకు దక్కాల్సిన రాజకీయ హక్కును కాలరాశారు.
– నారాయణ, బీసీ నాయకులు, చిత్తూరు
●


