నేడు స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానం | - | Sakshi
Sakshi News home page

నేడు స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానం

Oct 2 2026 3:09 AM | Updated on Oct 2 2026 3:09 AM

చిత్తూరు కార్పొరేషన్‌: రాష్ట్ర ప్రభుత్వం గురువారం స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర అవార్డులను ప్రకటించింది. జెడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు అవార్డుల ప్రదానం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, ప్రజాప్రతినిధులు పాల్గొని సంబంధింత శాఖల అధికారులకు అవార్డులు అందజేస్తారు. రాష్ట్ర స్థాయిలో 5, జిల్లా స్థాయిలో 64 అవార్డులు ఇవ్వనున్నారు. జిల్లాలోని ఈ అవార్డులను స్వచ్ఛ మున్సిపాలిటీలు, పంచాయతీలు, పాఠశాలలు, ఆస్పత్రులు, రైతు బజార్లు, బస్‌ స్టేషన్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, పరిశ్రమలు, హాస్టళ్ల సిబ్బందికి అందజేయనున్నారు.

చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి రూ.10.50 లక్షల విరాళం

చిత్తూరు కలెక్టరేట్‌ : చిత్తూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఆధునీకరణ, మౌలిక వసతుల కల్పనకు చిత్తూరు జిల్లా పండ్ల పరిశ్రమల సమాఖ్య సభ్యులు, ఒక యువకుడు రూ.10.50 లక్షల విరాళం అందజేశారు. వారు గురువారం కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌గాంధీని కలిసి చెక్కులు అందజేశారు. అదే విధంగా తవణంపల్లి మండలం గొల్లపల్లికి చెందిన గుర్రం వెంకటసిద్ధార్థ అనే యువకుడు తనవంతుగా ఆస్పత్రికి రూ.50 వేల విరాళం ఇచ్చారు. ఈ నిధులతో ఆస్పత్రిలోని ప్రసూతి, ఆర్థోపెడిక్‌ విభాగాలను ఆధునీకరించడంతో పాటు రోగులకు అవసరమైన అధునాతన వైద్య పరికరాలను సమకూర్చనున్నట్లు సమాఖ్య ప్రతినిధులు వెల్లడించారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద ముందుకు వచ్చి ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధికి ఆర్థిక సాయం ప్రకటించిన చిత్తూరు జిల్లా పండ్ల పరిశ్రమల సమాఖ్య ప్రతినిధులను, దాత వెంకటసిద్ధార్థను కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ప్రత్యేకంగా అభినందించారు. సమాజ హితం కోసం ఇటువంటి సేవా కార్యక్రమాల్లోకి మరిన్ని పరిశ్రమల ప్రతినిధులు, దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పండ్ల పరిశ్రమల ప్రతినిధులు రఘురాం చౌదరి, కట్టమంచి బాబి, సిద్ధార్థ్‌, మనోహర్‌, సుదర్శన్‌, చంద్రమోహన్‌, ఈశ్వర్‌, బషీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement