శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి

Oct 2 2026 3:09 AM | Updated on Oct 2 2026 3:09 AM

ఐరాల: విద్యార్థులు ప్రత్యక్షంగా ప్రయోగాలు చేసి ఆలోచనా శక్తిని, శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని డీఈఓ లక్ష్మీనారాయణ తెలిపారు. ఆయన గురువారం అగరంపల్లె, ఎం.పైపల్లె జెడ్పీ హైస్కూళ్ల లో స్టెమ్‌ ల్యాబ్‌(సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యా థ్స్‌)లను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ యూత్‌ ఫర్‌ సేవా సంస్థ కృషితో సైక్రాప్ట్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ డిజైన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో రూ.8.70 లక్షలతో స్టెమ్‌ ల్యాబ్‌ మెటీరియల్‌ను 6, 9 తరగతుల విద్యార్థులకు అందజేయడం అభినందనీయమని కొనియాడారు. ఈ ల్యాబ్‌ల ద్వారా విద్యార్థు లు సైన్స్‌, ఇంజినీరింగ్‌, టెక్నాలజీ ప్రయోగాలపై ప్రాక్టికల్స్‌ చేసి ప్రత్యక్ష అనుభూతి పొందవచ్చన్నారు. మెటీరియల్‌ ఉపయోగాలను హైస్కూల్‌ ప్లస్‌ ఉపాధ్యా యిని మీనాకుమారి, స్టెమ్‌ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలని తెలిపారు. తదుపరి బీఐఎస్‌(బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌) ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన, వకృత్త్వ పోటీలు నిర్వహించి ప్రథమ స్థానం సాధించిన విద్యార్థికి రూ.1,500, ద్వితీయ స్థానం సాధించిన విద్యార్థికి రూ.1,000 అందజేసి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పరీక్షల సహాయ కమిషనర్‌ జయప్రకాష్‌నాయుడు, ఎంఈఓలు రుషేంద్రబాబు, భానుప్రసాద్‌, హెచ్‌ఎం తులసీరామ్‌, యూత్‌ ఫర్‌ సేవా సంస్థ ప్రతినిధి హరీష్‌, ఉపాధ్యాయులు సుధాకర్‌, జయంతి, కృష్ణవేణి, నిషా, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement