వైఎస్సార్‌సీపీ పాలనలో స్వర్ణయుగం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ పాలనలో స్వర్ణయుగం

Sep 26 2026 12:14 AM | Updated on Sep 26 2026 12:14 AM

గ్రామీణులకు అందని 104 సేవలు జిల్లాలోని 39 వాహనాల్లో తిరిగేది 29 మాత్రమే! మరమ్మతుల పేరిట విజయవాడకు తరలింపు నెల నుంచి లేని మందులు డాక్టర్లు రాకపోవడంతో ఆశా కార్యకర్తలే దిక్కు బోగస్‌ ఓపీలతో అధికారులకు బురిడీ పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పల్లె వైద్యానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌న్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మకంగా తీసుకొచ్చిన ఫ్యామిలీ ఫిజిషియన్‌ విధానానికి జిల్లాను పైలెట్‌గా ఎంపిక చేసి విజయవంతంగా అమలు చేశారు. విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లే కేంద్రంగా వలంటీర్లు, ఆశా కార్యకర్తలు ముందుగానే సమాచారం అందించి 104 వాహనాలను గ్రామాలకు రప్పించేవారు. నడవలేని వృద్ధులు, దివ్యాంగులు ఉంటే డాక్టర్లే నేరుగా వారి ఇంటికి వెళ్లి ఉచితంగా పరీక్షించి, రూపాయి ఖర్చు లేకుండా పూర్తి స్థాయిలో మందులు అందించేవారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్‌ చేసుకున్న వారిని సైతం ఇంటికెళ్లి పరామర్శించి వైద్యం చేసేవారు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ఈ వైద్య వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఉచిత వైద్యం అందక పల్లె ప్రజలు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి వేలాది రూపాయలు అప్పులు చేసి వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి దాపురించింది. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి 104 వాహనాలకు మరమ్మతులు చేయించి, తగినన్ని మందులు అందుబాటులోకి తీసుకువచ్చి గ్రామీణులకు నాణ్యమైన వైద్యసేవలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కాణిపాకం: జిల్లా వ్యాప్తంగా పల్లె ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాల్సిన 39 సంచార వైద్య వాహనాల్లో ప్రస్తుతం కేవలం 29 మాత్రమే అరకొరగా తిరుగుతున్నాయి. మిగిలిన వాహనాలు వేర్వేరు మండలాల్లో అసలు కనిపించడమే మానేశాయి. గుడిపాల, బంగారుపాళ్యం, జీడీనెల్లూరు, కార్వేటినగరం, నగరి, గంగవరం, పులిచెర్ల, వి.కోట, బైరెడ్డిపల్లె, పెద్దపంజాణి మండలాలకు చెందిన 10 వాహనాలు సేవలకు దూరమయ్యాయి. అవి మరమ్మతులకు గురవడంతో విజయవాడకు పంపించామని అధికారులు చెబుతున్నప్పటికీ, దాదా పు నెల నుంచి పల్లె సేవలను పూర్తిగా నిలిపివేయ డం గమనార్హం. ముఖ్యంగా గుడిపాల మండలంలో 104 వాహనం కేవలం షెడ్డుకే పరిమితమైంది. బొమ్మసముద్రం, గుడిపాల ప్రాంతాల్లో అసలు వాహనం రాకపోయినా, సేవలందించినట్లు కాగితాల్లో చూపిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇటీవల సాక్షి దినపత్రికలో కథనం రావడంతో హడావుడిగా రిపేర్‌ పేరుతో అధికారులు ఆ వాహనాన్ని విజయవాడకు పంపించి చేతులు దులుపుకున్నారు.

బోగస్‌ ఓపీలు

సంచార వైద్యం తూతూమంత్రంగా మారడంతో ఉన్నతాధికారులు, ప్రభుత్వానికి అంతా బాగుందని చూపించుకోవడానికి క్షేత్రస్థాయి సిబ్బంది బోగస్‌ ఓపీలను నమోదు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు రోగులను పరీక్షించకుండానే వందలాది పేర్లను రికార్డుల్లో ఎక్కించి సేవలు అందించినట్లు కథలు అల్లుతున్నారని పలువురు చెబుతున్నారు. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తే ఈ బోగస్‌ డ్రామాలు వెలుగులోకి వస్తాయని స్పష్టం చేస్తున్నారు.

ఉండాల్సినవి ఇవీ..

104 వాహనంలో విధిగా ఉండాల్సిన జ్వరం మాత్రలు (పారాసిటమాల్‌ 500 ఎంజీ), గ్యాస్‌ ప్రాబ్లమ్‌ మాత్రలు (పాంటోప్‌ 40 ఎంజీ), ఒళ్లు నొప్పుల బిళ్లలు (డిక్లోఫెనాక్‌), బీపీ మాత్రలు (అటెనలాల్‌ 50 ఎంజీ, అమ్లోడిపిన్‌), యాంటీబయోటిక్స్‌ (అమాక్సిలిన్‌ 500 ఎంజీ, సెఫిక్సిమ్‌)తో పాటు చిన్నపిల్లలకు ఇచ్చే జ్వరం, దగ్గు, విరేచనాల టానిక్‌లు అసలు సరఫరా కావడం లేదు. దీంతో పాటు మరికొన్ని మాత్రలు, మందులు కూడా లేవని పలువురు సిబ్బంది చెబుతున్నారు. మందులు లేవని స్థానిక సిబ్బంది అధికారులకు నివేదికలు పంపినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని పలువురు విమర్శిస్తున్నారు.

నామమాత్రంగానే..

ప్రభుత్వ నిబంధనల ప్రకారం పీహెచ్‌సీలో పనిచేసే ఇద్దరు వైద్యుల్లో ఒకరు తప్పనిసరిగా 104 వాహ నంతో పాటు పల్లెలకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ, ప్రస్తుతం జిల్లాలో పలు చోట్ల డాక్టర్లు పల్లెలకు వెళ్ల డం లేదు. కేవలం ఏఎన్‌న్‌ఎంలు, ఆశా కార్యకర్తలు మాత్రమే నామమాత్రంగా పల్లెలకు వెళ్లి ఏదో మొక్కుబడిగా హడావుడి చేసి వస్తున్నారు. వాహనంలో ఏయే మందులు ఉన్నాయో, ఏ రోగానికి ఏ మాత్ర ఇవ్వాలో కూడా తెలియకుండానే చికిత్స పేరిట రోగులకు మందులు ఇచ్చి పంపించేస్తున్నారు. సాధారణ జ్వరం, బీపీ, షుగర్‌, ఒళ్లు నొప్పులకు ఇచ్చే ప్రాథమిక మందులు కూడా కరువయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement