ట్రైనీ కానిస్టేబుళ్ల పరేడ్‌ రిహార్సల్‌ | - | Sakshi
Sakshi News home page

ట్రైనీ కానిస్టేబుళ్ల పరేడ్‌ రిహార్సల్‌

Sep 26 2026 12:14 AM | Updated on Sep 26 2026 12:14 AM

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): చిత్తూరు నగరంలోని జిల్లా పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ పరేడ్‌ మైదానంలో 2025 బ్యాచ్‌కు చెందిన 142 మంది ట్రైనీ కానిస్టేబుళ్ల పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ రిహార్సల్స్‌ను శుక్ర వారం నిర్వహించారు. శనివారం జరగనున్న ప్రధాన పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ కోసం ట్రైనీలు కవాతు, మార్చ్‌పాస్ట్‌ చేపట్టగా.. ఎస్పీ తుషార్‌ డూడీ పర్యవేక్షించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రధాన పరేడ్‌ నిర్వహణ, విధుల్లో పాటించాల్సిన క్రమశిక్షణ, సమన్వయంపై ట్రైనీలకు, అధికారులకు పలు సూచనలు చేశారు. శనివారం నిర్వహించే ప్రధాన పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌కు రాష్ట్ర రవాణా, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి, కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ అతిథులుగా హాజరుకానున్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ మహబూబ్‌బాషా, ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ దేవదాస్‌, డీటీసీ డీఎస్పీ జె.రాంబాబు, ఏఆర్‌ డీఎస్పీ రామకృష్ణ్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement