జెడ్పీ ఉద్యోగుల పునర్విభజన పూర్తి | - | Sakshi
Sakshi News home page

జెడ్పీ ఉద్యోగుల పునర్విభజన పూర్తి

Sep 25 2026 1:47 AM | Updated on Sep 25 2026 1:47 AM

– IIలో

శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు
శ్రీకాళహస్తీశ్వరాలయంలో పవిత్రోత్సవాలను మూడో రోజు గురువారం శాస్త్రోక్తంగా నిర్వహించారు.

చిత్తూరు కలెక్టరేట్‌ : గత కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న జెడ్పీ పునర్విభజన కసరత్తు ఈనెల 24 వ తేదీతో పూర్తయింది. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిషత్‌ ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తిచేశారు. నూతనంగా ఏర్పడిన చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల పరిధిలోని జిల్లా పరిషత్‌లకు మొత్తం 88 మంది ఉద్యోగులను కేటాయించారు. ఉద్యోగుల విభజనలో భాగంగా పోస్టుల వారీగా సిబ్బందిని మూడు జెడ్పీలకు కేటాయిస్తూ జెడ్పీ సీఈవో రవికుమార్‌ నాయుడు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎటువంటి సిఫార్సులకు తావులేకుండా పారదర్శకంగా ఉద్యోగుల విభజన చేయడం జరిగిందని తెలిపారు.

చిత్తూరు జెడ్పీకి 38 మంది

కేటాయింపుల్లో చిత్తూరు జెడ్పీకి అత్యధికంగా 38 మంది, తిరుపతి జెడ్పీకి 27 మంది, అన్నమయ్య జెడ్పీకి 23 మంది ఉద్యోగులు కేటాయించారు. పరిపాలనా అధికారుల విభాగంలో చిత్తూరుకు 4, అన్నమయ్యకు 3, తిరుపతికి 9 మంది చొప్పున మొత్తం 16 మందిని కేటాయించారు. డ్రైవర్లు మూడు జెడ్పీలకు ఒక్కొక్కరు చొప్పున ముగ్గురిని కేటాయించారు. జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల్లో చిత్తూరుకు 13, అన్నమయ్యకు 8, తిరుపతికి 9 మంది చొప్పున మొత్తం 30 మందిని కేటాయించారు. ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టుల్లో చిత్తూరుకు 6, అన్నమయ్యకు 3, తిరుపతికి నలుగురు చొప్పున మొత్తం 13 మందికి కేటాయించారు. రికార్డు అసిస్టెంట్‌ పోస్టుల్లో చిత్తూరుకు ఇద్దరు, అన్నమయ్యకు ఒకరు, తిరుపతికి ఒకరు చొప్పున నలుగురిని కేటాయించారు. సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల్లో చిత్తూరుకు 8, అన్నమయ్యకు 5, తిరుపతికి 6 మంది చొప్పున మొత్తం 19 మందిని కేటాయించారు. టైపిస్టు పోస్టుల్లో చిత్తూరుకు 4, అన్నమయ్యకు 2, తిరుపతికి ముగ్గురు చొప్పున 9 మందిని కేటాయించారు. దీంతో జిల్లాల పునర్విభజన అనంతరం మూడు జిల్లా పరిషత్‌లకు అవసరమైన సిబ్బంది కేటాయింపు ప్రక్రియలో కీలక ఘట్టం పూర్తయిందని అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement